భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఎప్పుడంటే.. ?

నక్సలిజం అనే పదం చరిత్రలో మరో చీకటి అధ్యాయనంలా మిగిలిపోయింది.ఒకప్పుడు పేదల తరపున జరిగే ఈ పోరాటం రాను రాను హింస ప్రవృత్తిగా మారిపోయింది.

 Maoists Calls For Bharat Bandh On April 26th, Chhattisgarh, Bijapur, Tarem Fores-TeluguStop.com

ఇలాంటి చీకటి పోరాటవల్ల సమాజంలో మార్పు వస్తుందనుకుంటే ఇప్పటికి దేశం మొత్తం చీకట్లోనే మగ్గిపోయేది.

ఇకపోతే రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ బీజాపూర్ సమీపంలోని తరెం అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ల పై జరిగిన భీకర దాడిలో పచ్చని అడవి అంతా జవాన్ల రక్తంతో ఎర్రబడిపోయింది.

కాగా ఈ దాడిలో సుమారుగా 24 మంది జవాన్లు మరణించగా మరో 30 మంది జవాన్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

అదే విధంగా 15 మంది మావోయిస్టుల సైతం మృతి చెందినట్లు సమాచారం.

అంతే కాకుండా ఛత్తీస్ గఢ్ ఎదురుకాల్పుల తర్వాత కనిపించని కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టులు లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఈ నేపధ్యంలో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు మావోయిస్టులు.

అందులో ఆపరేషన్ ప్రహార్-3ని తక్షణమే నిలిపివేయాలని, ఏప్రిల్ 26న భారత్ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube