అక్కడ కరోనా వైరస్ తో చనిపోయిన వారిని ఏం చేస్తున్నారో వివరంగా చెప్పిన నాగార్జున చెల్లెలు...

1999వ సంవత్సరంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు నందమూరి హీరో హరికృష్ణ కలిసి నటించినటువంటి సీతారామరాజు అనే చిత్రంలో హీరోల చెల్లెలి పాత్రలో నటించినటువంటి నటి మాన్య ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 20కి పైగా చిత్రాల్లో  నటించింది.

 Manya, Telugu Actress, New York, Corona Virus, Tollywood Nagarjuna, Hariskrishna-TeluguStop.com

అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినటువంటి న్యూయార్క్ ఫైనాన్స్ సెక్టార్లో పనిచేస్తోంది.

అయితే ఈమె యునైటెడ్ స్టేట్స్ లోని కరోనా వైరస్ పరిస్థితులు గురించి వివరించింది.

గత కొద్దికాలంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది.అంతేగాక కరోనా వైరస్ కారణంగా ఎవరైనా వ్యక్తులు మరణిస్తే వారిని చూసేందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదని అంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.

మరోపక్క కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారిని దహన సంస్కారాలు నిర్వహించేందుకు క్రేన్ ల సహాయం ఉపయోగిస్తున్నారని మరికొన్ని ప్రాంతాల్లో అయితే శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కూడా తెలిపారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని, అంతేకాక కరోనా వైరస్ గురించి ఎటువంటి అనుమానాలు ఉన్న వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో దాదాపుగా 4,30,000 పైచిలుకు పాజిటివ్ కేసులను గుర్తించారు.అయితే ఇందులో 24 వేలమంది ఈ కరోనా వైరస్ భారి నుంచి కొలుకోగా 14 వేల పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube