ప్రధానితో కేసీఆర్ మీటింగ్ ! ఫిక్సింగ్ నిజమేనా ? 

ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.అనేక అంశాల గురించి చర్చించారు.

 Many Doubts Over Kcr Prime Minister Narendra Modis Meeting Prime Minister, Naren-TeluguStop.com

అయితే తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉప్పు నిప్పు లా  పరిస్థితి ఉన్న నేపథ్యంలో, కెసిఆర్ ప్రధానితో భేటీ కావడం పెద్ద దుమారమే రేపుతోంది.అసలు కేసీఆర్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం మరెన్నో అనుమానాలకు తావిస్తోంది.

నేరుగా ప్రధాని కలిసేందుకు కేసీఆర్ ఢిల్లీ కి వెళ్తే తీవ్రమైన రాజకీయ విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం పేరుతో ఈ వ్యవహారం నడిపినట్లు గా అభిమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రస్థాయిలోనే పోరు నడుస్తోంది.

ఈ సమయంలో కెసిఆర్ ప్రధాని తో భేటీ కావడం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.కెసిఆర్ అకస్మాత్తుగా ప్రధాన కలవాలని నిర్ణయించుకున్నారు.

         అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది అని టిఆర్ఎస్ చెబుతున్నా,  వారం ముందే ప్రధాని అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుందని,  కానీ ఆ విషయం బయటకు చెప్పకుండా ఢిల్లీ లో టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన అన్నట్లుగా కవర్ చేశారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.అదీకాకుండా గల్లీలో పాదయాత్ర చేస్తే మోకాళ్లు అరగడం తప్ప,  మోడీ అపాయింట్మెంట్ ఇవ్వరని, అదే కేసీఆర్ అడిగితే వెంటనే ఇస్తారని రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన తర్వాత ప్రధానితో కేసీఆర్ మీటింగ్ ఫిక్సింగ్ నిజమేనా ?  ప్రధానితో కేసీఆర్ భేటీ కావడం పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
     

Telugu Bandi Sanjay, Hujurabad, Kcr Modhi, Narendra Modi, Prime, Revanth Reddy,

  తెలంగాణలో మాత్రమే బీజేపీ టీఆర్ఎస్ మధ్య వైరం ఉందని,  జాతీయ స్థాయిలో మాత్రం స్నేహం ఉందనే విషయంపై కాంగ్రెస్ అదే పనిగా విమర్శలు చేస్తోంది.ప్రధాని మోడీ తో కేసీఆర్ తలపడేందుకు సిద్ధంగా లేరని , ప్రధాని సూచనల తోనే ఆయన నడుచుకుంటున్నారని,  కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండడం,  కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లకపోవడం ఇవన్నీ మోదీ అనుమతితోనే చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేసి , తాము అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగా , కేసీఆర్ మాత్రం కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ,  తెలంగాణ బిజెపి నేతల ఆశలపై నీళ్ళు చల్లుతున్నట్లు వ్యవహారాలు చేస్తున్నట్టు గా వ్యవహారాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube