తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు....

ఇవాళ ఉదయం వి.ఐ.

 Many Celebrities Visited Thirumala Srivastava, Celebrities , Visited , Thirumal-TeluguStop.com

పి‌ విరామ సమయంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి, ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టిటిడి మాజీ ఈవో ఎం.జి.గోపాల్ లు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.

ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రెండు రోజుల పాటు నిర్వహించే కాలేజీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తిరుపతికి రావడం జరిగిందన్నారు.

స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని, టిటిడి కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడం ఆనందదాయకం అన్నారు.అమెరికాలో థర్డ్ డోస్ కూడా వచ్చిందని,5 సం” నుండి 11″సం లోపు చిన్నపిల్లలకు అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ డోస్ ప్రారంభించినట్లు తెలిపారు.

తానా ద్వారా లోకల్ సిటీస్ లో వ్యాక్సినేషన్ డోస్ లు చేస్తున్నామని,కొత్త వేరియంట్ వచ్చినా గానీ, యూఎస్ గతంలో కంటే పరిస్థితి బాగా మెరుగుపడిందని,యూఎస్ లో‌ 99 శాతం ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకున్నారని ఆయన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube