ఆ పాత్ర చేయాలంటే సిగ్గు పడతారంటున్న జాన్వీ కపూర్..?

సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రతిభ ఉంటే మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది.బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాని హీరోహీరోయిన్లు ఇండస్ఱీలో ఎంతోమంది ఉన్నారు.

 Many Actors Shy Away To Accept That Role Jhanvikapoor On Karthikeyan Role In Dos-TeluguStop.com

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.కెరీర్ తొలినాళ్లలోనే విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించిన దోస్తానా 2 సినిమా త్వరలో విడుదల కానుంది.2008 సంవత్సరంలో విడుదలైన దోస్తానా సినిమాకు సీక్వెల్ గా దోస్తానా 2 తెరకెక్కుతోంది.రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన దోస్తానాలో అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా జాన్ అబ్రహం నటించగా సీక్వెల్ లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ లతో పాటు లక్ష్ లాల్వానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.

Telugu Dostana, Dostana Sequel, Homo Sexuality, Jhanavi Kapoor, Kartheek Aryan,

ఈ సినిమా హోమో సెక్సువాలిటీ కథాంశంతో తెరకెక్కగా జాన్వీ కపూర్ ఆ పాత్ర గురించి చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం మారుతున్నా హోమో సెక్సువాలిటీ పదం చుట్టూ ఎన్నో అపప్రదలు ఉన్నాయని ఆమె అన్నారు. కార్తీక్ ఆర్యన్ ఇలాంటి పాత్రలో నటించాడంటే అతనని మెచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.ఈ పాత్రలో నటించాలంటే ఎంతోమంది సిగ్గు పడతారని కానీ కార్తీక్ మాత్రం చేశాడని జాన్వీ కపూర్ తెలిపారు.

మరోవైపు జాన్వీ కపూర్ ను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.త్వరలోనే తెలుగులో జాన్వీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో హిట్ అవుతున్న నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ కథతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ లాక్ డౌన్ సమయంలో జాన్వీ కపూర్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube