డాక్టర్ కావాలని అనుకొని యాక్టర్ అవుతున్న అంటున్న మిస్ వరల్డ్  

Manushi Chhillar Open Up Her Career, Bollywood, Indian Cinema, Bollywood Heroines, Miss Universe - Telugu @manushichhillar, Bollywood, Bollywood Heroines, Haryana, Indian Cinema, Manushi Chhillar, Manushi Chhillar Open Up Her Career, Miss Universe, Mumbai, Pruthvi Raj

2017లో మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకొని సుస్మితా సేన్ తర్వాత ఇండియాకు గుర్తింపు తీసుకొచ్చిన అందాల సుందరి మానుషీ చిల్లార్.హర్యానాకి చెందిన ఈ భామ విశ్వ సుందరి పోటీల తర్వాత మోడలింగ్ లో బిజీ అయ్యింది.హీరోయిన్ గా అవకాశం మాత్రం మూడేళ్ళ తర్వాత వచ్చింది.ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్ పృథ్వీరాజ్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

TeluguStop.com - Manushi Chhillar Open Up Her Careers

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఈ సుందరి తెరంగేట్రం చేస్తుంది.ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది.ఈ నేపధ్యంలో మోడలింగ్, సినిమా కెరియర్ గురించి వ్యక్తిగత మానుషీ ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని వ్యక్తిగత విష‌యాలు షేర్ చేసుకుంది.

త‌న స్వ‌స్థ‌లం హ‌ర్యానాను విడిచిపెట్టి ముంబైకి రావ‌డం కొత్త అనుభూతి అని చెప్పింది.

TeluguStop.com - డాక్టర్ కావాలని అనుకొని యాక్టర్ అవుతున్న అంటున్న మిస్ వరల్డ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నేను డాక్ట‌ర్ కావాల‌నుకు‌న్నా.అందాల పోటీల్లో పాల్గొనడానికి ముందు ఒక్క‌సారి కూడా ముంబైకి రాలేదు.

కొన్నేళ్ల ముందు ముంబై నాకు కొత్త‌.సిటీలో నాకు ఎవ్వ‌రూ తెలియ‌దు.

కానీ ఇపుడు ముంబై నా హోమ్ టౌన్ గా మారిపోయింది.మూడేళ్ల‌లో ముంబైతో ఇలాంటి అనుబంధం ఏర్ప‌డ‌టం అంతా కొత్తగా అనిపిస్తుంది.

డాక్ట‌ర్ కావాల‌నుకున్న నేను సంబంధం లేకుండా ఇలా మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఈ రంగంలోకి వ‌చ్చి ఇపుడు నటిగా ముందుకొస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.మొత్తానికి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అనే సామెత మానుషీ చిల్లార్ కి కరెక్ట్ గా సరిపోతుందని బాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు.

#Haryana #ManushiChhillar #Miss Universe #Pruthvi Raj #Mumbai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manushi Chhillar Open Up Her Careers Related Telugu News,Photos/Pics,Images..