పుట్ట మధు అరెస్ట్ వెనక ఉన్న తతంగం ఇదేనటా.. !?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.ఎందుకంటే ఇన్నాళ్లూ తెరమీదికి రాని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్ వ్యవహారం తాజాగా సంచలనానికి కేంద్రబిందువుగా మారిందట.

 Manthani Zp Chairman Putta Madhu Arrest Reason , Manthani, Zp Chairman, Putta Ma-TeluguStop.com

అయనను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పుట్ట మధు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు.

కాగా ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత, ఈటల ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది.

ఇదే సమయంలో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లాడు.

అయితే ఈటల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకే మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Telugu Cm Kcr, Etelafollower, Etela Rajender, Manthani, Putta Madhu, Taskce, Tel

ఇదిలా ఉండగా వామన్‌రావ్ దంపతుల హత్య కేసులో మధును అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్న ఆ హత్య జరిగి సుమారుగా మూడు నెలలు గడిచింది.

ఇకపోతే ఈ హత్య విషయం లో సీఎం కేసీఆర్ ఈ ఘటనకు పెద్ద లీడర్లు ఎవరికీ సంబంధం లేదని స్వయంగా ప్రకటించారు.అలాంటప్పుడు వామన్‌రావు కేసులో మళ్లీ ఇప్పుడు పుట్ట మధును విచారించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇక ఈ వ్యవహారాన్ని ఎంతలా కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నా ఈటలను టార్గెట్ చేసేందుకే మధు వ్యవహారం వెలుగులోకి తెస్తున్నట్లుగా అంతా చర్చించుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube