నేను ఇలా మారడానికి కారణం మీరే అంటూ ఐ ఫోన్ పై కేసు వేసిన రష్యన్, విషయం ఏమిటంటే!

ఫోన్ లలో యాప్స్ ఉండడం అనేది సర్వసాధారణం .అయితే మీ యాప్ వల్లే నేను ఇలా మారిపోయాను అని ఒక రష్యన్ ఏకంగా ఐ ఫోన్ సంస్థ పైనే కేసు వేయడం ఇంతకీ విషయం ఏమిటంటే ఐ ఫోన్ ‘గే కాయిన్’ క్రిప్టో కరెన్సీ అనే యాప్ ద్వారా నేను ఇలా గే గా మారాను అంటూ వాపోయాడు.

 Mansues Apple Claiming Iphone Turned Himgay-TeluguStop.com

ఐఫోన్లో యాప్ ద్వారా తాను బిట్‌కాయిన్‌కు ఆర్డర్ ఇవ్వగా, ‘గేకాయిన్’ అనే క్రిప్టో కరెన్సీ తనకు వచ్చిందని, అయితే నాకు అందిన గే కాయిన్ క్రిప్టో కరెన్సీపై “ప్రయత్నించకుండా అభిప్రాయానికి రావొద్దు” అనే నోట్ ఉండడం తో ఈ సమస్య వచ్చింది అంటూ తన ఫిర్యాదు లో పేర్కొన్నాడు.అయితే ఆ యాప్ లో సూచించిన ప్రకారం ప్రయత్నించకుండా దేనిపైన అయినా అభిప్రాయానికి ఎలా రాగలనని తాను అనుకున్నానని, అందుకే స్వలింగ సంపర్కం సంబంధాల ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకొన్నానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.ఈ విషయం మా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.

నా జీవితం దెబ్బతింది.నేనెప్పటికీ తిరిగి సాధారణంగా ఉండలేను అని నాకు ఈ పరిస్థితి రావడానికి యాపిల్ సంస్థ యాప్ కారణం అంటూ ఆరోపించాడు.

Telugu Apple Phone, Iphon, Iphone Gay, Telugu Ups-

  యాపిల్ తప్పుడు పనితో తనను హోమోసెక్సువాలిటీ వైపు నడిపించిందన్నారు.దీనివల్ల తనకు మానసికమైన, నైతికపరమైన హాని జరిగిందని, ఇందుకు పరిహారంగా పది లక్షల రూబుళ్లు (10.97 లక్షల రూపాయలు) చెల్లించాలంటూ బాధితుడు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube