ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాజీ మిస్ ఇండియా.. !

రాజకీయాల్లోకి అందాల తారలు రావడం కొత్తేమి కాదు.ఇలా వారి అందంతో పార్టీకి ప్రత్యేక ఆకర్షణ తెస్తూ ఓటర్లను ఆకట్టుకున్న వారెందరో ఉన్నారు రాజకీయాల్లో.

 Mansi Former Miss India Joins Aam Aadmi-TeluguStop.com

ఇదిలా ఉండగా ఫెమీనా అందాల పోటీల్లో 2019 వ సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న ఢిల్లీకి చెందిన మాన్సీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై, రాజకీయాల్లో ప్రవేశించారు.ఈ విషయాన్ని స్వయంగా మాన్సీ వెల్లడించారు.

 Mansi Former Miss India Joins Aam Aadmi-ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాజీ మిస్ ఇండియా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పట్టా అందుకున్న మాజీ మిస్ ఇండియా మాన్సీ సెహ్ గల్, ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో, ఆప్ నేత రాఘవ్ చద్ధా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచంలో స్వచ్ఛమైన రాజకీయాల ద్వారా గణనీయమైన మార్పు తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు.

#Beauty Queen #Delhi #FormerMiss #Mansi Sehgal #Raghav Chadda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు