ఓరినీ.. పోన్‌ చూస్తూ టాయిలెట్‌ బేసిన్‌ లో పడిపోయాడు, అయినా దాన్ని మాత్రం వల్లేదు.. ఆరు గంటలు చుక్కలు

ఈమద్య కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌లను పిల్లలు వదలడం లేదు.రెండు మూడు ఏళ్ల పిల్లలు కూడా స్మార్ట్‌ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తూ వారితో ఒక ఫోన్‌ ఎప్పుడు ఉంచుకుంటున్నారు.

 Mans Rectum Falls Out After Playing Phone Games On Toilet-TeluguStop.com

అత్యంత ప్రమాదకరమైన ఈ పరిస్థితి ఎక్కడకు దారి తీస్తుందో అని అంతా ఆందోళన చెందుతూనే ఉన్నారు.ఫోన్‌ల వల్ల ప్రమాదాలు చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి.

తాజాగా చైనాకు చెందిన ఒక బుడతడు ఫోన్‌ను పట్టుకుని చూసుకుంటూ ఉన్నాడు.దాంతో అతడు పీకల్లోతు ఇబ్బందిలో చిక్కుకున్నాడు.

చైనాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.వివరాల్లోకి వెళ్తే… చైనాలోని వుహాన్‌లో ఒక పిల్లాడు ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యాడు.ఎప్పుడు గేమ్స్‌ వీడియోలు అంటే ఫోన్‌ను వదిలి పెట్టేవాడు కాదు.తాజాగా అతడు బాత్‌ రూంకు వెళ్లే సమయంలో కూడా ఫోన్‌ తీసుకు వెళ్లాడు.

ఫోన్‌ మోజులో పడి తాను బాత్‌రూంలో ఉన్న సంగతి మర్చి పోయాడు.ఫోన్‌లో ఇన్వాల్వ్‌ అయిన అతడు మెల్ల మెల్లగా టాయిలెట్‌ బేసిన్‌లోకి జారిపోయాడు.

తడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు.దాంతో గట్టిగా అరిచాడు.

అప్పుడు తల్లిదండ్రులు వచ్చారు.

తల్లిదండ్రులు మరియు పక్కవారు చాలా మంది చాలా సేపు ప్రయత్నించారు.కాని అతడు బలంగా ఇరుక్కు పోయాడు.బలవంతంగా లాగే పరిస్థితి లేదు.

అలా అని మెల్లగా లాగితే రావడం లేదు.దాంతో చేసది లేక ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేయగా వారు ప్రత్యేకమైన పరికరాలతో ఆ బేసిన్‌ను మెల్లగా బద్దలు కొట్టి అతడిని బయటకు తీశారు.

దాదాపు ఆరు గంటల పాటు చుక్కలు చూశాడు.మరోసారి ఫోన్‌ పట్టుకుని బాత్‌రూంకు వెళ్లను అని, బాత్‌రూంలో ఇకపై చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ ఆ బాలుడు ఆ తర్వాత చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube