సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మగవాడి 'మెన్స్ డే'పోస్ట్.! ఈ సమాజంలో బతకలేకపోతున్నాం.!

ఎదవ బతుకైపొయ్యింది బాసూ !


నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం


లేడీస్‌ ఫస్ట్‌.వినీవినీ మనల్ని మనం ‘వెన’ కేసుకునీ.

 Mans Inner Feeling About Himself In Mens Day-TeluguStop.com

కునీ.బతికేస్తున్నాం.

అరె.ఉద్యోగాల్లోనూ వారే.రాజకీయాల్లోనూ వారే.చివరాఖరుకు సినిమా క్యూల్లోనూ వారే.ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌.మనకెప్పుడూ నెక్స్‌ట్‌ ఛాన్సే.

థూ.ఎదవ బతుకైపొయ్యిందనిపించడం ల్యా.అరె.మన మానాన మనం బైక్‌మీద పోతుంటే.అడ్డదిడ్డంగా వారు ఎదురొచ్చినా మనల్నే చెడామడా తిట్టేస్తారు చుట్టున్నవాళ్లందరూ.బజారులో నిలబడి కంట్లో పడిన నలుసుకు కాస్తలా రెప్పకొట్టుకుందామన్నా భయమే.ఏ గాళ్‌ అపార్థం చేసేసుకుని కస్సుమంటూ లేస్తుందేమోనని.ఇవ్వాళ రేపు ఈ సమాజంలో బతకలేకపోతున్నాం భయ్‌.ద్వితీయ శ్రేణి పౌరులుగా మరీ హీనమైపోతున్నాం.

బాధ్యతలేనా, హక్కులుండవా ? దిసీజ్‌ టూ మచ్‌ బ్రో.!


పొరపాటున లవ్‌ చేస్తే.ఇంకంతే సంగతులు.

ఐస్‌క్రీం పార్లర్లు.ఐ మ్యాక్స్‌ షోలు.

లవ్‌ను ప్రూవ్‌ చేసుకోవడానికి అడుగడుగునా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు.జిందగీ చింకి చాటైపోదా.

రేపెప్పుడైనా మనం కొనిచ్చిన రింగ్‌కు చుట్టిన రేపర్‌ నచ్చక.లేదా అలాంటి ఏదైనా కారణంతోనే మనకా పిల్ల గుడ్‌ బై చెప్పేసిందా.

మన బతుకు బస్టాండే.మన మీద నిందలేస్తూ ఈ లోకం కాకై పొడుస్తుంది.

అయినా బలుపు కాకపోతే.ఇంట్లో ఇచ్చిన మనీతో తిని, తాగి, తిరగక.

ఆ ముసినవ్వుకు, ఓర చూపుకు పడిపొయ్యి.బొంగరంలా అమ్మాయి చుట్టూ తిరగడమెందుకు?

కరెంటు బిల్లు మనమే కట్టాల.గ్యాస్‌ బండ రాకపోతే మనమే బండిమీద మోసుకురావాల.ఎంత పనిలో ఉన్నా నాన్న అరుపులకు జీ హుజూర్‌ అనాల.

అమ్మ మందలింపులకు తల వంచుకోవాల.ఏం.ఇంట్లోని చెల్లాయో.అక్కయ్యో.

ఈ పనులెందుకు చెయ్యరు? వారిమీద అమ్మానాన్నలు అజమాయిషీ ఎందుకు చలాయించరు? మగ పుట్టుక పుట్టిన పాపానికి ఇన్నేసి కష్టాలా.పొరపాటున పెళ్లైపొయ్యిందో.

ఇకంతే, మన ఖేల్‌ ఖతమన్నట్టే.కుటుంబమనే దారానికి తగులుకుని ఉన్నా.

అంతదాకా గాల్లో స్వేచ్ఛగా ఎగిరే గాలిపటాలం.

ఓ ఆడదాని మెళ్లో మూడుముళ్లూ వేశాక.ఆ దారం జరజరా వెనక్కు లాగేసి, గాలిపటం ఆ ‘ముళ్ల’లో చిక్కడిపోతుంది.బలవంతంగా లాగితే చినిగిపోతుంది.

లేదని వదిలేస్తే.గుచ్చుకునే ముళ్లతో విలవిల్లాడిపోతుంది.

సంసారంలో మగాడిగా.అది కూడా ఇంటిపెద్దగా మనుగడ సాగించడంకంటే కత్తిమీద సాము చేయడం బెటరు బాసూ.

మనకు సాంబారిష్టం.తనకు పులుసిష్టం.

తనకు సుమ ప్రోగ్రాములిష్టం.మనకు న్యూస్‌ ఇష్టం.

ఇంకా ఇటువంటి విరుద్ధ ఇష్టాలే ఇద్దరివీ.మన ఇష్టాలు కాలక్రమంలో మరిచిపోతాం.

తన ఇష్టమే కష్టంగానైనా మన ఇష్టంగా మలిచేసుకుంటాం.

కాదంటే ఏమవుద్దో.‘గృహ హింస’ కేసుల్లో తగులుకున్న భార్యాబాధితులను అడగండి ఇట్టే చెప్పేస్తారు.సీరియస్‌గా విషయంలోకి వస్తే.

కుటుంబ పోషణను మన బాధ్యతగా తేల్చి చెప్పింది లోకం.కుటుంబ సభ్యులెవరు కాస్త తేడాగా అనిపించినా మనల్నే దోషిని చేస్తోంది.

మనం.పురుష పుంగవులం.ఏడవడం నిషిద్ధం.మనల్ని మహిళాలోకం ఏడిపిస్తున్నా సరే.ఏమనకపోవడమే మన మంచితనానికి నిదర్శనం.

గుండె లోతుల్లో గాయాలెన్ని బాధిస్తున్నా.

చిరునవ్వుతో భరించడం అవసరం.వీటిలో ఏ ఒక్కటి లోపించినా ‘వీడేం మగాడం’టూ హేళన చేస్తుంది లోకం.

‘పురుషులు కూడా మనుషులే.వారికీ బాధ్యతలతో పాటు కొన్ని హక్కులుంటాయి.

ఇతరులను గౌరవించడంతో పాటు స్వతంత్ర భావాలుంటాయి.సంతోషమేస్తే నవ్వులుంటాయి.

గుండె మెలిపడితే కాసిన్ని కన్నీళ్లుంటాయి.’ అని లోకానికి చాటి చెప్పుకునేందుకే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.

ఎస్‌.దిసీజ్‌ ట్రూ.

లెటజ్‌ సెలబ్రేట్‌.దిస్‌ ఇంటర్నేషనల్‌ మెన్స్‌ డే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube