అతడి పొట్టే అతడి ప్రాణాలు కాపాడింది!

పొట్ట.ఇది అంటే ఎవరికి పడదు.కుదిరితే తొందరగా తగ్గించుకోవాలని చూస్తుంటారు.ఉదయం లేచినప్పటి నుంచి సాయింత్రం పడుకునే వరకు పొట్ట తగ్గడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.కానీ పొట్ట తగ్గదు.తిండి తగ్గించిన తగ్గదు.

 Man Big Belly Saved Life,mans Big Belly, Lifesaver, Falling Down, Well, China-TeluguStop.com

ఈ పొట్ట కారణంగా అవమానాలే కాదు అనారోగ్యానికి కూడా గురవుతాం.

ఎక్కువ పని చేయలేకపోవడం, ఎక్కువ దూరం అలసట లేకుండా నడవలేకపోవడం, అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు రావడం వంటి నష్టాలు ఉన్నాయ్.

ఇన్ని నష్టాలు ఉన్న పొట్ట ఇప్పుడు ఓ ప్రాణం కాపాడింది.అలా ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.చైనాలోని హెనాన్ ప్రాంతంలోని లోవ్‌యంగ్‌లో లియు అనే 28 ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్ద ఉన్న ఓ చిన్నపాటి బావిలో పడిపోయాడు.

అయితే అతడికి పొట్టలేకపోయింటే ఈజీగా ఆ బావిలో మునిగిపోయి అతడి ప్రాణాలే పోయేవు.

కానీ అతడికి పొట్ట ఉండటం వల్ల అతడి పొట్ట అతన్ని కిందకు పడకుండా అడ్డు పడింది.దీంతో బావిలో పడి మరణించాల్సిన వాడు పొట్ట కారణంగా బ్రతికి బయటపడ్డాడు.

ఈ ఘటన జరిగి వారం అవుతున్నప్పటికి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మీరు ఓసారి ఆ ఫోటోలను చూడండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube