సోనియా పై ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు,కొండను తవ్వి చచ్చిన ఎలుకను పట్టుకున్నారు!  

Manohar Lal Khattar Compares Sonia Gandhi With Dead Mouse-congress,manohar Lal Khattar,movie,rahul Ghandi,sonia Gandhi,telugu Viral News Updates,viral In Social Media

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అక్కడ త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా మనోహర్ నోరు జారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారుఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం రాజకీయనేతలకు పరిపాటి.

Manohar Lal Khattar Compares Sonia Gandhi With Dead Mouse-congress,manohar Lal Khattar,movie,rahul Ghandi,sonia Gandhi,telugu Viral News Updates,viral In Social Media-Manohar Lal Khattar Compares Sonia Gandhi With Dead Mouse-Congress Manohar Movie Rahul Ghandi Sonia Telugu Viral News Updates In Social Media

అయితే, కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వ్యక్తిగతానికి దారితీయడమే వివాదాలకు కారణమవుతోంది.తాజాగా మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ‘చచ్చిన ఎలుక’ అంటూ ఖట్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అయితే ఖట్టర్ వ్యాఖ్యలపై మండిపడుతోన్న కాంగ్రెస్ నేతలు.వెంటనే సోనియా కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన తరువాత ఆ పార్టీ పరిస్థితి పై మాట్లాడిన ఖట్టర్ ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, అయితే గాంధీయేతర కుటుంబ వ్యక్తులే ఆ పార్టీ కొత్త అధ్యక్షులుగా పగ్గాలు చేపడతారంటూ చెప్పుకొచ్చి అటు చేసి ఇటు చేసి చివరికి 3 నెలల తరువాత తిరిగి సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అని ఖట్టర్ అన్నారు.దీనితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అయ్యింది అది కూడా చచ్చిన ఎలుకను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Manohar Lal Khattar Compares Sonia Gandhi With Dead Mouse-congress,manohar Lal Khattar,movie,rahul Ghandi,sonia Gandhi,telugu Viral News Updates,viral In Social Media-Manohar Lal Khattar Compares Sonia Gandhi With Dead Mouse-Congress Manohar Movie Rahul Ghandi Sonia Telugu Viral News Updates In Social Media

అయితే ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారుM