నేడు గోవా సిఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు! హాజరు కానున్న ప్రధాని

నాలుగు సార్లు గోవా ముఖ్యమంత్రిగా పని చేసి, రక్షణ మంత్రిగా కేంద్రంలో కూడా తనదైన ముద్ర వేసిన మనోహర్ పారికర్ మరణ వార్త దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో విషాదం నింపింది.ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన ముద్ర వేసిన, అతి సామాన్య జీవితం గడిపే మనోహర్ పారికర్ అంటే అన్ని పార్టీల నేతలకి అభిమానం ఉంది.

 Manohar Parrikar Cremation In Sag Grounds-TeluguStop.com

కష్టకాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలలో అతని నిబద్దతని అందరూ గౌరవించారు.దీంతో ఆయన మరణించారని తెలియగానే అన్ని పార్టీల నేతలు వెంటనే తమ సతాపం తెలియజేసారు.

ఇదిలా ఉంటే ఈ రోజు మనోహర్ పారికర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో గోవా ప్రభుత్వం పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత పనాజీలో బీజేపీ కార్యాలయంకి చేరుకుంటుంది నేతలందరూ వచ్చి అక్కడ నివాళి అర్పించిన తర్వాత 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు.

అనంతరం ఎస్ఎజీ గ్రౌండ్స్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.ఈ అంత్యక్రియలకి ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది.అలాగే ఈ రోజు ఆయన మృతికి నివాళిగా కేంద్రం సంతాపం దినం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube