సిక్కు అల్లర్లకి పీవీ నరసింహరావే కారణం అంటున్న మాజీ ప్రధాని

పీవీ నరసింహారావు… ఈ పేరు తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.తెలుగు రాష్ట్రం నుంచి దేశ ప్రధానిగా చేసిన ఏకైక వ్యక్తి.

 Manmohans Pv Narasimha Rao-TeluguStop.com

దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న సాంకేతిక విప్లవంకి ఇండియాలో బీజం వేసింది పీవీ నరసింహారావు.అతను తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల కారణంగా ఈ రోజు ఇండియా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలలో పోటీ పడుతుంది.

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా పీవీ నరసింహారావు సేవలని ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటారు.అంతేకాకుండా అతనిలో బహుముఖ ప్రజ్ఞాశాలి, పండితుడు, కవిని తెలుగు ప్రజలు చూస్తారు.

ఇక పీవీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అతనికి అత్యంత అవమానకరంగా వీడ్కోలు చెప్పింది.

ఓ విధంగా చెప్పాలంటే ఇప్పటికి నెహ్రు కుటుంబంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గొప్పతనం ఒప్పుకోదు.

అతనిని చిన్న చూపు చూస్తూనే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా మాజీ ప్రధాని కాంగ్రెస్ అధినేత్రి నమ్మిన బంటు మన్మోహన్ సింగ్ పీవీ నరసింహారావు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.1984లో జ‌రిగిన సిక్కుల ఊచ‌కోత‌ సమయంలో హోంమంత్రిగా ఉన్న పీవీ నర్సింహారావుపై విమర్శలు చేశారు.ఆయన నిర్లక్ష్యం కారణంగానే అల్లర్ల తీవ్రత పెరిగిందన్నారు.

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ ఆర్మీని రంగంలోకి దింపాలని చెప్పిన పీవీ పట్టించుకోలేదన్నారు.గుజ్రాల్‌ చెప్పినట్లుగా ఆర్మీని రంగంలోకి దింపి ఉంటే పరిస్థితి అదుపులోనే ఉండేదని అభిప్రాయపడ్డారు.

దీనిపాప ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube