వ్యాక్సినేషన్ వేగవంతం చేయండంటున్న మాజీ ప్రధాని మహ్మోహన్ సింగ్

కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తున్న సందర్భంలో వ్యాక్సినేషన్ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొన్ని సూచనలు చేశారు.ఆదివారం మోదీకి ఓ లేఖ రాశారు మన్మోహన్ సింగ్.

 Manmohan Singh Suggestions To Pm Narendra Modi Corona Vaccination-TeluguStop.com

కరోనాని నివారించాలంటే వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని.అదే మంచి మార్గమమని అన్నారు.

అంతేకాదు ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్లు, ఏయే సంస్థల నుండి ఆర్డర్ తీసుకున్నారో తెలియచేయాలని కోరారు.ప్రస్తుత పరిస్థితులను బట్టి ఫ్రంట్ లైన్ వర్కర్లను తీసుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని మన్మోహన్ సింగ్ తన లేఖలో రాశారు.

 Manmohan Singh Suggestions To Pm Narendra Modi Corona Vaccination-వ్యాక్సినేషన్ వేగవంతం చేయండంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం అండగా ఉండాలని మన్మోహన్ చెప్పారు.వారికి నిధులు, రాయితీల విషయంలో ప్రోత్సాహం అందించాలని అన్నారు.టీకాల విషయంపై ఏయే సంస్థల నుండి ఎన్ని టీకాలు తీసుకున్నారో ప్రజలకు తెలియచేయాలని అన్నారు.రానున్న ఆరు నెలల్లో ఎన్ని టీకాలు వస్తాయి.

వాటిని రాష్ట్రాలకు ఎలా పంచుతారో కూడా ముందే తెలియచేయాలని అన్నారు.రాష్ట్రాలు కూడా వీటి వల్ల తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాయని అన్నారు.

 దేశంలో కొన్ని చోట్ల కరోనా వ్యాక్సినేషన్ కొరత ఏర్పడింది.దీనిపై కేంద్ర దృష్టి పెట్టగా మరిన్ని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తుంది కేంద్రం.

#Process #Manmohan Singh #Narendra Modi #ManmohanSingh #Suggestions

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు