మరోసారి రాజ్యసభ బరిలో మన్మోహన్,ఈ సారి ఎక్కడనుంచి అంటే!  

Manmohan Singh Sign To File Nomination For Rajyasabha From Rajasthan-

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాజ్యసభ బరిలో నిలిచినట్లు తెలుస్తుంది.గత కొద్దీ రోజులుగా ఆయన మరోసారి రాజ్యసభ బరిలో నిలుస్తారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Manmohan Singh Sign To File Nomination For Rajyasabha From Rajasthan--Manmohan Singh Sign To File Nomination For Rajyasabha From Rajasthan-

ఆయన ఏజ్ దృష్ట్యా ఇక ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన కనిపిస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది.ఇటీవల ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడం తో ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

Manmohan Singh Sign To File Nomination For Rajyasabha From Rajasthan--Manmohan Singh Sign To File Nomination For Rajyasabha From Rajasthan-

అయితే అవన్నీ పక్కన పెడుతూ ఆయన మరోసారి రాజ్యసభ బరిలో దిగనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 13న మన్మోహన్‌ సింగ్‌ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.ఈసారి రాజస్థాన్‌ నుంచి మన్మోహన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సమాచారం.మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు తొలిసారిగా 1991లో అసోం నుంచి ఎన్నికయ్యారు.1995, 2001, 2007, 2013లో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.1998 – 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మన్మోహన్‌ సింగ్‌ కొనసాగారు.

2004 నుంచి 2014 వరకు వరుసగా రెండుసార్లు ప్రధానిగా సేవలందించిన ఆయన ఇప్పుడు మరోసారి రాజ్యసభ బరిలో నిలుస్తున్నారు.కాంగ్రెస్ కురువృద్ధుడు గా పేరున్న మన్మోహన్ ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.