ఫస్ట్ డే కలెక్షన్స్: మన్మథుడు 2 ఇంకా ఎంత రాబట్టాలంటే?

నాగార్జున మన్మథుడు 2 సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తో పరవలేదనిపించింది.మిక్సీడ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయి అనేది చెప్పడం కష్టంగానే ఉంది.

 Manmadhudu 2first Daycollections-TeluguStop.com

వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మినిమామ్ వసూళ్లను అందుకుంటుందని టాక్.ఇక పోటీగా కూడా పెద్ద సినిమలేమి లేకపోవడం మన్మథుడికి కలిసొచ్చే అంశం.

ఫస్ట్ డే కలెక్షన్స్: మన్మథుడు

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.మొదటి రోజు మన్మథుడు 2 వరల్డ్ వైడ్ గా 8.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.ఇక షేర్స్ విషయానికి వస్తే 4.89కోట్లను రికవర్ చెసినట్లు సమాచారం.ప్రస్తుతం టాక్ చూస్తే.

సినిమాలో అడల్ట్ కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే.కానీ యూత్ ఆడియెన్స్ ని సినిమా బాగానే ఆకట్టుకుంటోంది.

వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్.

ఫస్ట్ డే కలెక్షన్స్: మన్మథుడు

18.4కోట్ల తియేట్రికల్ వాల్యూ కలిగిన మన్మథుడు 2 హిట్ లిస్ట్ లో చేరాలంటే మినిమామ్ 20 కోట్ల షేర్స్ ని రాబట్టాలి.ఫస్ట్ డే ఒక వంతు షేర్స్ ని అందుకున్న ఈ సినిమా ఇంకా 16 కోట్ల వరకు రికవర్ చేయాల్సి ఉంది.

మరి ఈ హాలిడేస్ లో ఎంతవరకు రాబడుతుందో చూడాలి.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై నాగ్ సొంతంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube