మన్మధుడు 2 వీకెండ్‌ కలెక్షన్స్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యమేనా?  

Manmadhudu 2 First Week Box Office Collections-

నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ‘మన్మధుడు 2’ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు మంచి ఓపెనింగ్స్‌ అయితే రాలేదని చెప్పక తప్పదు.స్టార్‌ హీరోల సినిమాలు మొదటి రోజే ఈజీగా 10 కోట్లు రాబడుతుంటే ఈ చిత్రం మాత్రం ఆస్థాయిలో రాబట్టలేక పోయింది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ బయ్యర్లను తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాయి...

Manmadhudu 2 First Week Box Office Collections--Manmadhudu 2 First Week Box Office Collections-

మొదటి రోజు అయిదు కోట్లకు లోపు కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో 10 కోట్ల వసూళ్లను అయితే రాబడుతుందని భావించారు.కాని కథనం మరియు కొబ్బరి మట్ట చిత్రాలు పోటీ ఉన్న కారణంగానో లేక మరేంటో కాని మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం కేవలం 8.7 కోట్ల రూపాయలను మాత్రమే దక్కించుకుంది.పది కోట్ల లోపు వసూళ్లతో ఈ చిత్రం వీకెండ్‌ను పూర్తి చేసుకుంది.

ఇక వీక్‌ డేస్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం అయితే లేదు.ఇక ఆగస్టు 15వ తారీకున పలు సినిమాలు రాబోతున్నాయి కనుక మరో వీకెండ్‌ వరకు ఈ సినిమా ఉండే అవకాశం లేదు.

Manmadhudu 2 First Week Box Office Collections--Manmadhudu 2 First Week Box Office Collections-

పరిస్థితి చూస్తుంటే లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం 11 నుండి 12 కోట్ల వరకు మాత్రమే రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ఈ చిత్రంపై వచ్చిన అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 18.4 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది.ఈ మొత్తం రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది.బయ్యర్లకు కనీసం ఆరు నుండి ఏడు కోట్ల వరకు నష్టం అయితే రాబోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.