ఈ సూపర్ హిట్ సీరియల్స్ ని తీసింది ఓ మహిళ అని మీకు తెలుసా?

సాధారణంగా ప్రస్తుతం కాలంలో ఏ సినిమా హిట్ అయినా.ఏ సీరియల్ హిట్ అయినా అందరూ కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పురుషులే ఉంటున్నారు.

 Manjula Naidu, Mogalirekulu, Chakravakam, Agnipulu, Tv Serials, Trp Ratings, Sra-TeluguStop.com

ఎక్కడో ఒకరు ఇద్దరు స్త్రీలు మాత్రమే డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు.మనకు కాస్త ఆశ్చర్యం వేసినప్పటికీ ఇది అక్షరాలా నిజం.100 శాతంలో 97 శాతం పురుషులే ఉంటారు.ఇక అలాంటిది 2003, 2004 సమయంలోనే ఓ మహిళ సీరియల్స్ కి దర్శకత్వం వహించి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

ఆ ఒక్క సీరియల్ ఏ కాదు ఆతర్వాత రెండు మూడు సీరియల్స్ తియ్యగా అవి కూడా సూపర్ హిట్ కొట్టాయి.ఇప్పుడు టివిలో వేసిన ఆ సీరియల్స్ ని చూస్తూనే ఉన్నారు.

టీఆర్పీ పెంచుతూనే ఉన్నారు.ఆ సీరియల్స్ యేవో కాదు చక్రవాకం, మొగలిరేకులు, అగ్నిపుల్, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ తీసిన డైరెక్టర్.

ఇంకా గుర్తు రాలేదా? ఆమెనండి మంజుల నాయుడు.ఈ దర్శకురాలి పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.

జెమినీ టీవీలో అద్భుతమైన సీరియల్స్ తీసి అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని దర్శకత్వంలో ఓ కొత్తదనాన్ని తీసుకొచ్చిన దర్శకురాలు మంజుల నాయుడు.ఆమె తీసిన సీరియల్ అన్ని సూపర్ హిట్టే.

ఇప్పుడు జెమినీ టీవిలో మళ్లీ పునః ప్రసారం చేస్తున్న అప్పట్లో టిఆర్పి ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడు అదే రేంజ్ లో ఈ సీరియల్స్ కు వస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంత అద్భుతమైన సీరియల్స్ అవి.ఇక ఈమె మొదట తీసిన చక్రవాకం సీరియల్ ఇంట్రో సాంగ్ అయితే అద్భుతం.అలాంటి సీరియల్ సాంగ్ ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube