దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తనను అసభ్యంగా దూషించాడని, మానసిక వేదనకు గురి చేసాడంటూ ఓ దర్శకుడిపై హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీని ప్రస్తుతం షేక్ చేస్తోంది.

 Manju Warrier Complaint Against Director Sreekumar Menon-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాళ్లోకి వెళ్తే.ప్రముఖ మలయాళ హీరోయిన్ మంజూ వారియర్ తన భర్త దిలీప్‌తో విడాకుల తరువాత దర్శకుడు శ్రీకుమార్ దర్శకత్వంలో వివిధ సినిమాలలో నటించింది.

కానీ వీర మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలతో ఇప్పుడు వీరి మధ్య వివాదం చెలరేగింది.ఈ క్రమంలో శ్రీకుమార్ దర్శకత్వంలో ఒడియన్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకుమార్ తనను సెట్స్‌లో అసభ్యంగా దూషించాడని.ఇండస్ట్రీ నుండి వెళ్లగొడతానంటూ బెదిరించి మానసిక ఒత్తిడికి గురిచేశాడని.

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన కామెంట్స్ ద్వారా తన పరువు తీసాడని పోలీసులను ఆశ్రయించింది మంజు వారియర్.

Telugu Manju Warrier, Sreekumar Menon-

ఈ మేరకు శ్రీకుమార్‌పై ఐపీసీ 509 సెక్షన్‌తోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహరా తెలిపారు.దీంతో శ్రీకుమార్‌పై విచారణ చేపట్టినట్లు కేరళ పోలీసులు తెలిపారు.మరి ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళుతుందో చూడాలంటున్నారు మలయాళ ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube