మనీషా మెడకి చుట్టుకున్న ఇండియా-నేపాల్ సరిహద్దుల గొడవ  

Manisha Koirala Gets Trolled For Supporting Nepals New Map - Telugu Bjp, Bollywood, Indian Government, Manisha Koirala Gets Trolled For Supporting Nepal\\'s New Map, Tollywood

గత కొద్ది రోజులుగా నేపాల్ ప్రభుత్వం చైనా సపోర్ట్ తో ఇండియా మీద కాలు దువ్వే ప్రయత్నం చేస్తుంది.భారత్ తమ భూభాగాలని ఆక్రమించుకుంది అంటూ కొత్త స్వరం వినిపిస్తుంది.

 Manisha Koirala Gets Trolled For Supporting Nepals New Map

హిందుత్వ దేశంగా ఉన్న నేపాల్ తో భారత్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి అయితే ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం చైనా అండతో భారత్ ని కవ్వించే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా ఇండియాలో అంతర్భాగమైన కాలాపాని, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలను తమవేనని పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించిన నేపాల్, కొత్త మ్యాప్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నేపాల్ నిర్ణయంపై భారత్ తీవ్ర అగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, నేపాల్ పౌరురాలు అయిన మనీషా కోయిరాలా ఓ ట్వీట్ చేసింది.

మనీషా మెడకి చుట్టుకున్న ఇండియా-నేపాల్ సరిహద్దుల గొడవ-General-Telugu-Telugu Tollywood Photo Image

మన చిన్న దేశం గౌరవాన్ని నిలబెట్టారు.అందుకు ధన్యవాదాలు.భారత్, చైనా, నేపాల్ మధ్య శాంతియుతమైన, గౌరవ ప్రదమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నాం అని ట్వీట్ చేసింది.ఇది భారత్ లోని నెటిజన్లుకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఇండియాలో ఉంటూ, ఇండియాలో ఉపాధి పొందుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న మ్యాప్ ను సమర్థిస్తున్నావా.వెంటనే దేశం వదిలి వెళ్ళిపో అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం గవర్నర్ స్వరాజ్ కౌశల్ ఏకంగా మనీషాను టార్గెట్ చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు.మ్యాప్ ను సమర్థించడంపై ఆమెను తప్పుబట్టారు.

తనకు మనీషా తండ్రి ప్రకాశ్ కోయిరాలాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.నేపాల్ తో ఉన్న గొడవల మధ్యలోకి చైనా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావంటూ మండిపడ్డారు.

ఇక నెటిజన్లు అయితే మనీషా కొయిరాలాకి ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు.దీనిపై ఆమె ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manisha Koirala Gets Trolled For Supporting Nepals New Map Related Telugu News,Photos/Pics,Images..