మణిరత్నం కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి  

Sobhita Dhulipala Joins The Cast Of Mani\'s Ponniyin Selvan - Telugu Aishwarya Rai, Kollywood, Mani Ratnam\\'s, Mani\\'s Ponniyin Selvan, Sobhita Dhulipala

తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించాలని అనుకున్న టాలీవుడ్ లో వారికి ఈ మధ్యకాలంలో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.అందం, అభినయం ఉన్నా కూడా దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిల మీద అంత శ్రద్ధ చూపించడం లేదు.

Sobhita Dhulipala Joins The Cast Of Mani's Ponniyin Selvan

దీనిపై హీరోయిన్స్ గా రాణిస్తున్న చాలా మంది తెలుగు భామలు పలు సందర్భాలలో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.తెలుగులో సక్సెస్ కాని తెలుగు హీరోయిన్స్ ఇతర భాషలలో మాత్రం వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకొని తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు.

ఇలాంటి వారిలో శోభిత ధూళిపాళ్ళ కూడా ఒకరు.

మిస్ ఇండియా విన్నర్ గా అందాల పోటీలలో ప్రతిభ చూపిన ఈ భామ తరువాత సినిమా కెరియర్ ఎంచుకొని బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.ఇక బోల్డ్, గ్లామర్ లో బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోకుండా అందాలు ఆరబోయడంతో శోబితకి బాలీవుడ్ లో భాగానే పట్టం కట్టారు.

అయితే తెలుగులో గూడచారి అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది.ఆ సినిమాలో ఒకే అనిపించుకున్న తెలుగు దర్శకులు ఈ భామకి ప్రాధాన్యత ఇవ్వలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ ఏకంగా మణిరత్నం సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది.పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.

విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు.వీరితో పాటు తాజాగా శోభితా ధూళిపాళ్లని కూడా మణిరత్నం ఈ సినిమా కోసం ఎంపిక చేశారు.

మణిరత్నంగారి దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని శోభిత తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది.

తాజా వార్తలు