గిన్నీస్ రికార్డ్: ఒక్క నిమిషంలో ఏకంగా అన్ని పుషప్స్..!

కృషి, పట్టుదల ఉంటే మనుషులు ఏదన్నా సాధించగలరు అనడానికి ఈ యువకుడు ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.

 Manipur Man Niranjoy Guinness Record With Pushups Details, Gunnis Record, Viral-TeluguStop.com

దానిని సందర్భానుసారంగా ఉపయోగిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు అని ఈ యువకుడు నిరూపించి చూపించాడు.కేవలం ఒక నమిషంలో 109 పుషప్స్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడు.

పుషప్స్ చేయడం అంటే మాములు విషయం కాదు.అందులోను కేవలం ఒక నిమిషంలో 109 పుషప్స్ చేయడం అంటే నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.

మరి ఆ యువకుడు ఎవరు.? ఏంటి అనే వివరాలు తెలుసుకుందామా.

ఈ సంఘటన మణిపూర్ లో చోటుచేసుకుంది.మణిపూర్ కు చెందిన 24 ఏళ్ల థౌనఓజమ్ నిరంజోయ్ సింగ్ అనే యువకుడు కేవలం నిమిషం వ్యవధిలో 109 పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు.ఇప్పటివరకు ఉన్న గ్రహం మాలే యొక్క రికార్డును బ్రేక్ చేసాడు నిరంజోయ్.2009లో బ్రిటన్ కు చెందిన గ్రహం మాలే అనే వ్యక్తి ఎక్కువ పుషప్స్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఎక్కితే ఇప్పుడు మళ్ళీ 13 సంవత్సరాలకు అతని పేరిట ఉన్న రికార్డును నిరంజోయ్ తిరగరాశాడు.ఈ రికార్డ్ ను బద్దలు కొట్టడం కోసం నిరంజోయ్ మాములుగా కష్టపడలేదండోయ్.

దాదాపు 13 సంవత్సరాలుగా రాత్రనక పగలనక శ్రమించి మరి విజయం సాధించాడు.

అయితే నిరంజోయ్ ఇలా గిన్నిస్ రికార్డుల కెక్కడం ఇదేమీ మొదటిసారి కాదు.ఇప్పటికే అతని పేరిట రెండు గిన్నిస్ రికార్డులు ఉన్నాయి.అవి ఏంటంటే.2019లో ఒక్క నిమిషంలో అత్యధిక వన్ ఆర్మ్, వన్ లెగ్ పుషప్స్ చేసిన వ్యక్తిగా రికార్డ్ సాధించాడు.అలాగే 2020లో వన్ ఆర్మ్ పుషప్స్ చేసిన మరొక రికార్డ్ నిరంజోయ్ సొంతం.కాగా., మణిపూర్ కు చెందిన యువకుడు గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు నిరంజోయ్ విజయం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నా అని హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.అలాగే గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టిన అతన్ని పలువురు నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

Manipur Man Niranjoy Guinness Record With Pushups Details, Gunnis Record, Viral News, Viral Social, Push-up, Manipur Man, Niranjoy, Guinness Record ,pushups, Minister Kiran Rijiju - Telugu Guinness, Gunnis, Manipur, Kiran Rijiju, Niranjoy, Pushups #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube