మణిరత్నం నవరస ట్రైలర్ రిలీజ్.. ఒక్కో పాత్ర?

మణిరత్నం సినిమా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.ప్రకృతి అందాలను ఎంతో అందంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే మణిరత్నం గారికి చాలా కాలం నుంచి ఒక విజయవంతమైన సినిమా కూడా లేకుండా ఉన్నారు.

 Mani Ratnam Navarasa Trailer Release Each Character-TeluguStop.com

ఈ క్రమంలోనే విభిన్న ఆలోచనతో, అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి మణిరత్నం గారు ఈసారి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నటువంటి “నవరస“అని వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిలో ఎంతో ఆసక్తిని నెలకొల్పుతుంది.మణిరత్నం నవరసను తొమ్మిది మంది డైరెక్టర్లతో, తొమ్మిది మంది సెలబ్రెటీలతో, 9 సిరీస్ లుగా తెరకెక్కించబోతున్నారు.

 Mani Ratnam Navarasa Trailer Release Each Character-మణిరత్నం నవరస ట్రైలర్ రిలీజ్.. ఒక్కో పాత్ర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ నవరస సిరీస్ కి బెజోయ్ నంబియార్, అరవింద స్వామి, వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, ప్రియదర్శన్, కార్తీక్ సుబ్బరాజు, రతింద్రన్ ఆర్ ప్రసాద్, సర్జన్ కే ఎం, వసంత్ ఎస్ సాయి లు దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పుతుంది.

Telugu Kollywood, Main Ratnam, Mani Ratnam\\'s Web Series Navarasa, Tollywood, Trailer, Web Seriess-Movie

మణిరత్నం గారు నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తమిళనాడు సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, రేవతి, ఐశ్వర్య రాజేష్, అరవింద స్వామి, రోబో శంకర్, యోగి బాబు వంటి తొమ్మిది మంది సెలబ్రిటీలు కీలక పాత్రలో నటిస్తున్నారు.త్వరలోనే నిర్మాణ పనులన్నింటినీ పూర్తిచేసుకుని ఈ చిత్రం ఆగస్టు 6 తేదీన ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

#Ratnam #ManiRatnams #Trailer #Kollywood #Web Seriess

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు