శుభకార్యాల్లో మామిడి ఆకులు ఎందుకు వాడతారో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యంలోను మామిడి ఆకులను ఉపయోగిస్తాం.మామిడి ఆకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.

 Mango Leaves Spiritual Significance-TeluguStop.com

మామిడి ఆకుల గురించి రామాయణ,మహాభారత గ్రంధాలలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.ప్రతి శుభకార్యంలోను మంగళ తోరణాలు కట్టటానికి మామిడి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాం.

మామిడి ప్రేమకు,సంపద,సంతానాభివృద్ధికి సంకేతం.పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడి ఆకులను ఉపయోగిస్తాం.మామిడి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.అందువల్ల ఆ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.

 Mango Leaves Spiritual Significance-శుభకార్యాల్లో మామిడి ఆకులు ఎందుకు వాడతారో తెలుసా-Telugu Bhakthi-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి.

ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి.అలాగే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది.

మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌.

త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌.ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు లభిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU