బిగ్‌బాస్ ఇంటిలో అడుగుపెడుతున్న మరో ఫోక్ సింగర్

టాలీవుడ్‌లో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా, బిగ్‌బాస్ షోకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే.బిగ్‌బాస్ రియాలిటీ షో తొలి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, అది అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Mangli In Bigg Boss 4, Mangli, Sathyavati, Bigg Boss 4, Nagarjuna, Tollywood New-TeluguStop.com

ఆ తరువాత రెండో సీజన్‌ను నాని, మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయగా, అవి కూడా పూర్తి విజయాలను అందుకున్నాయి.

కాగా ప్రస్తుతం నాలుగో సీజన్‌కు రెడీ అవుతున్న బిగ్‌బాస్ షోకు నాగార్జున హోస్ట్‌గా మరోసారి వ్యవహరించనున్నాడు.

అయితే ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరెవరు పాల్గొంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ(సత్యవతి) కనిపించనుందని తెలుస్తోంది.

తనదైన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సింగర్, బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అయితే బిగ్‌బాస్ 4ను ఇటీవల నిర్వాహకులు అనౌన్స్ చేసినా, అందులో పాల్గొనే వారి గురించిన వివరాలను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

దీంతో మంగ్లీ ఈ షోలో ఉంటుందా లేదా అనేది సందేహంగా మారింది.ఏదేమైనా మంగ్లీ లాంటి సింగర్ ఈ షోలో పాల్గొంటే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ షోలో ఇంకా ఎవరెవరు పాల్గొంటారో తెలియాలంటే ఈ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube