మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?  

Mangalavaram Ee Panulanu Cheste Emi Avutundi -

ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మంచి రోజు చూసుకొని పనులను ప్రారంభిస్తాం.అలాగే చేసే పని విజయవంతం కావాలని కోరుకుంటారు .

అందువల్ల ఎవరు ఏ పనిని అయినా మంగళవారం ప్రారంభించటానికి ఇష్టపడరు.అయితే మంగళవారం కొన్ని పనులను చేయకూడదని మన పెద్దవారు చాలా గట్టిగా చెప్పుతూ ఉంటారు.

మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా-Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

వాటిని కొంత మంది పాటిస్తారు.అలాగే కొంతమంది తేలికగా తీసుకుంటారు.

అయితే ఇప్పడు మంగళవారం ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

తలస్నానము చేసే విషయంలో ఆడవారికి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి.మగవారికి ఆలా ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు.అయితే ఆడవారైనా మగవారైనా మంగళవారం తలస్నానము చేస్తే మంచిది కాదట.

ఆలా చేస్తే అశుభ ఫలితాలు రావటమే కాకుండా ఆ రోజు మంచి జరగదట.

మంగళవారం కుజుడికి సంకేతం కాబట్టి ఆ రోజు చేసే పనులను బాగా అలోచించి చేయాలి.

ఎందుకంటే కుజుడి ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది.కుజుడి ప్రభావం ఉంటే అన్ని కలహాలే వస్తాయి.

అందుకే మంగళవారం ఏమి చేసిన కాస్త అలోచించి చేయటం మంచిది.

మంగళవారం గోళ్లు కత్తిరించకూడదు.

అలాగే హెయిర్ కటింగ్ కి కూడా వెళ్ళకూడదు.అంతేకాక ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావటం కష్టం.

అలాగే ఎవరి దగ్గరి నుంచి అయినా అప్పు తీసుకుంటే ఆ డబ్బు అనవసర ఖర్చులకు ఖర్చు అయ్యిపోతుంది.

మంగళవారం ఆంజనేయుని పూజించటం వలన కుజుడి కారణంగా వచ్చే సమస్యలు అన్ని తొలగిపోతాయి.

మంగళవారం ఎర్రని పువ్వులతో ఎర్రటి బట్టలను కట్టుకొని తమ ఇష్ట దైవాన్ని పూజిస్తే అపాయాలు తొలగిపోతాయి.అయితే జాతకంలో కుజ దోషం ఉన్నవారు మాత్రం ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు.

TELUGU BHAKTHI