షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ! సంగతేంటి ?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన సర్ వేగంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తో రెండు రోజుల క్రితం లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించడం, ఆ సమావేశానికి తెలంగాణకు చెందిన వైఎస్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులైన నాయకులు హాజరు కావడం పెద్ద సంచలనం సృష్టించింది.ఇక దీని వెనుక జగన్ ఉన్నారనే ఒక వాదన, కాదు  కెసిఆర్ ఇదంతా నడిపిస్తున్నారనే మరో వాదన నడిచింది.

 Jagan, Tdp, Chandrababu, Ap, Mangalagiri, Alla Ramakrishnareddy, Sharmila, Brot-TeluguStop.com

ఈ వ్యవహారం ఇలా ఉండగా షర్మిల మాత్రం తెలంగాణలో వివిధ జిల్లాలకు చెందిన తమ సన్నిహితులైన నాయకులను కలుస్తూ హడావుడి చేస్తున్నారు.ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నాయకులతో షర్మిల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి కీలకమైన నాయకులందరితోనూ సమావేశాలు నిర్వహించి, బలమైన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగించి, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే షర్మిల పార్టీ ఏర్పాట్లపై జగన్ పైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే ) షర్మిలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Telugu Chandrababu, Jagan, Khammam, Mangalagiri, Sharmila, Ycpmla-Telugu Politic

సుదీర్ఘంగా షర్మిలతో చర్చించడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఆర్కే కు జగన్ తో పాటు , షర్మిల తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం , 2019 ఎన్నికల సమయంలో లోకేష్ పై ఆర్కే పోటీ చేసిన సమయంలో షర్మిల ప్రచారానికి రావడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆర్కే జగన్ దూతగానే షర్మిల దగ్గరకు వెళ్లి వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం.

షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ తోనూ ప్రత్యేకంగా భేటీ అవ్వడంపై రాజకీయ వర్గాల్లో అనేక అనేక అనుమానాలు ఎన్నో వ్యక్తం అవుతున్నాయి.అసలు జగన్ కు షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్కే.

షర్మిల, అనిల్ కుమార్ తో సమావేశం కావడం రాజకీయంగా సంచలనం గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube