శక్తి పీఠాలలో ఒకటైన మంగళ గౌరీ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.అలాంటి వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచారామం వంటివి ఎన్నో ఉన్నాయి.

 Mangala Gauri Temple Highlights-TeluguStop.com

జ్యోతిర్లింగాలలో ఆ పరమ శివుడు కొలువై ఉంటే అష్టాదశ శక్తి పీఠాలలో సాక్షాత్తు ఆ జగన్మాత కొలువై ఉంటుంది.పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ యజ్ఞానికి దేవాది దేవతలందరినీ ఆహ్వానిస్తాడు.

అయితే ఆ పరమశివుడికి ఆహ్వానం పంపించడు.అయినప్పటికీ తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొనే పార్వతీదేవి వెళ్తుంది.

 Mangala Gauri Temple Highlights-శక్తి పీఠాలలో ఒకటైన మంగళ గౌరీ ఆలయం ఎక్కడుందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ ఎన్నో అవమానాలు భరించలేక ఆ అగ్ని హోమంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఆ విధంగా పార్వతీదేవి మరణంతో శివుడు తాను నిర్వహించాల్సిన కార్యక్రమాలను మానేస్తాడు.

దీంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా 18 ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్య బోధ చేస్తాడు.ఆ విధంగా విష్ణుమూర్తి వధించినప్పుడు పార్వతీ దేవి శరీరభాగాలు పడిన ప్రదేశంలో ఈ శక్తి పీఠాలు వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ విధంగా వెలిసిన పద్దెనిమిది పీఠాలలో ఒకటిగా మంగళ గౌరీ ఆలయం.

ఈ మంగళ గౌరీ ఆలయం భారత దేశంలోని బీహార్ లో గల ‘గయా’ లో కొలువైన అమ్మ వారు భక్తుల కోరికలు తీరుస్తుంది.పార్వతి దేవి తొడ భాగం ఈ ప్రదేశంలో పడటం వల్ల అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామం ఉంటుంది.దీనినే మంగళగౌరీగా పూజిస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించిన వారి కోరికలు తప్పకుండా నెరవేరతాయనీ ఇక్కడ ప్రజల నమ్మకం.అంతేకాకుండా తన భర్త దీర్ఘాయుష్షు కోసం ఎంతోమంది పుణ్యస్త్రీలు ఈ ఆలయంలో మంగళగౌరీ వ్రతం నిర్వహిస్తుంటారు.

అంతేకాకుండా పెళ్లి సమయంలో వధువు చేత తన వివాహ జీవితం బాగుండాలని మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాము.

#MangalaGowri #MangalaGowri #Gaya #Mangala Gauri #Temple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU