మంగళ గౌరీ వ్రతం ఎందుకు? ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటో తెలుసా?   Mangala Gauri Puja Procedure, Mangala Gouri Vratha Vidhanam     2018-08-13   10:14:17  IST  Laxmi P

శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైనది కావటంతో మన పెద్దవారు ఈ నెలలో అనేక వ్రతాలు,పూజలు, శివ పూజ,శివునికి అభిషేకాలు చేయటం వలన సుఖ సంతోషాలను పొందుతాం. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. రేపు మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతి దేవికి మరొక పేరు మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు సుఖ సంతోషాలు,సౌభాగ్యం, ఐదోతనం కలకాలం నిలుస్తుందని నమ్మకం.

ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపతికి వివరించినట్టు మన పురాణాలు చెపుతున్నాయి. కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మాంగల్యానికి అధిదేవత అయినా గౌరీ దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆలా కొత్తగా పెళ్ళైన వారు తమ మంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా ఉండేలా చేయమని వివాహం అయినా సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేస్తారు.

ఈ మంగళ గౌరీ వ్రతాన్ని మొదటి సంవత్సరం పుట్టింటిలోను మిగతా నాలుగు సంవత్సరాలు అత్తింటిలోను ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రత నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు తల్లి పక్కనే ఉండాలి. తోలి వాయినం కూడా తల్లికే ఇవ్వాలి. వ్రతం చేసుకొనే రోజు ఉపవాసం ఉండాలి. మొదటి వారం ఐదుగురు ముత్తయిదులను పిలిచి వాయనం ఇవ్వాలి. ప్రతి వారం ఒకే మంగళ గౌరీ విగ్రహానికి పూజ చేయాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.