శాండ్విచ్ తిని ఏకంగా 4 సంవత్సరాలు కోమాలోకి.... చివరికి

సాధారణంగా మనుషులు తలకి ఏదైనా బలమైన దెబ్బ తగలడం వల్ల కానీ, లేదా ఏదైనా పెద్ద ప్రమాదానికి గురవడం వల్ల గాని కోమాలోకి వెళుతుంటారు.కానీ ఓ యువకుడు శాండ్విచ్ తిని ఏకంగా నాలుగు సంవత్సరాలు కోమాలో ఉండి మరణించిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది.

 Maneating Sandwich In Germany-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు కార్యాలయంలో పని చేస్తున్నటువంటి ఓ యువకుడు తన సహచర ఉద్యోగి అయినటువంటి ఓ వ్యక్తి ఇచ్చేటువంటి శాండ్విచ్ లను తింటుండేవాడు.అయితే ఈ క్రమంలో అతడు ఒక రోజున శాండ్విచ్ తినడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఇది గమనించిన  తోటి సహచర ఉద్యోగులు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అయితే వైద్య పరీక్షల అనంతరం ఆ యువకుడు వెళ్ళింది అపస్మారక స్థితిలోకి కాదని కోమాలోకి వెళ్ళాడని నిర్ధారించారు.

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సహచర ఉద్యోగులు ఖంగుతిన్నారు.  దీంతో తాను పని చేస్తున్న యాజమాన్యం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు.

Telugu Germany, Germany Latest, Sandwich-Latest News - Telugu

అయితే ఈ విచారణలో భాగంగా పోలీసులు శాండ్విచ్ అమ్మేటువంటి దుకాణదారులు విచారించారు.అయితే ఇందులో వారికి కీలక ఆధారాలు ఏమీ లభించలేదు.కానీ కోమాలోకి వెళ్లినటువంటి వ్యక్తి ఎప్పుడూ శాండ్విచ్ ల కోసం తమ దుకాణానికి రాలేదని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అంతేగాక ఆ వ్యక్తి తో పాటు పని చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు మాత్రమే తమ దుకాణానికి వచ్చే వాళ్ళని తెలిపారు.

దీంతో పోలీసులు  అతడిపై హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్టు అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా తన సహచర ఉద్యోగులను విచారించగా ఉద్యోగి తరచూ షాప్ కి వెళ్లి శాండ్విచ్ కొని తన సహచర ఉద్యోగులకు ఉండేవాడని మరియు ఆ సాండ్విచ్ పదార్థాల్లో కొన్ని రసాయనాలను కలిపి ఇచ్చేవాడని ఆ రసాయనాలు కడుపులో ఉన్నటువంటి కొన్ని రసాయనాలతో కలిస్తే మనిషి మెల్లగా మరణిస్తాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఇందులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నిజాలు బయట పడినట్లు తెలుస్తోంది.కానీ కోమాలోకి వెళ్లిన టువంటి యువకుడు అప్పటికే మరణించాడు.

దీంతో మరణించిన వ్యక్తి సహ ఉద్యోగి అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube