మందు బాటిల్ తో పోజులిచ్చిన నటి. దాంతో నెటిజన్లు...

ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది.అయితే ఇందులో ఏ మాత్రం కొంచెం అసభ్యకరంగా కనిపించడం లేదా యువతను తప్పుదోవ పట్టించే విధంగా కనిపిస్తే కొందరు పనిగట్టుకొని మరి ఇలాంటి వాటి గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో నెగటివ్ ట్రోల్స్ చేయడం వంటివి చేస్తుంటారు అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి మందిరా బేడీ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

 Mandira Bedi Facing Negative Comments For Promoting Liquor Products In Social Media-TeluguStop.com

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే సోషల్ మీడియా మాధ్యమాలను ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మందిరా బేడీ అప్పుడప్పుడు తనకు సంబంధించిన సినిమా అప్డేట్లు మరియు ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటోంది.

కాగా ఇందులో భాగంగా తాజాగా మందిరా బేడీ మద్యం ఉత్పత్తుల సంబంధించిన బ్రాండ్  ని ప్రమోట్ చేసే పనిలో భాగంగా మద్యం బాటిల్ ని చేతిలో పట్టుకొని ఫోజులిచ్చింది అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

 Mandira Bedi Facing Negative Comments For Promoting Liquor Products In Social Media-మందు బాటిల్ తో పోజులిచ్చిన నటి. దాంతో నెటిజన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొందరు నెటిజన్లు మందిరా బేడీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా సెలెబ్రెటీ హోదాలో ఉన్నటువంటి వారు ఆరోగ్యానికి హానికరం చేసేటటువంటి మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు డబ్బుకోసం మద్యపానం, ధూమపానం ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తున్నారని కాబట్టి ఇలాంటి వాటి వల్ల యువత తప్పు దోవ పడుతుందని కాబట్టి ఇప్పటికైనా పొగాకు మరియు మద్యం ఉత్పత్తులను సినీ సెలబ్రిటీలు ప్రమోట్ చేయకుండా నిషేధించాలని కోరుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మందిరా బేడీ మలయాళంలో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఎజాం ముద్ర” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడుఅనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

#MandiraBedi #Mandira Bedi #SocialMedia #MandiraBedi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు