సేల్స్‌మెన్‌ నుంచి పోలీస్ అధికారిణి స్థాయికి: ఎన్ఆర్ఐ మహిళ అసామాన్య ప్రస్థానం

అమ్మగా లాలిస్తుంది.అక్కా, చెల్లిగా అనుబంధాన్ని పంచుతుంది.

 Mandeep Kaur Sales Person To Top Cop New Zealand-TeluguStop.com

భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.పాత్ర ఏదైనా పరిపూర్ణ బాధ్యత నిర్వర్తించే అపూర్వ వ్యక్తి మహిళ.

ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం… వినడానికి బాగానే ఉంది.కానీ లింగవివక్ష మహిళల సంఖ్య తగ్గిపోయేలా చేస్తోంది.

 Mandeep Kaur Sales Person To Top Cop New Zealand-సేల్స్‌మెన్‌ నుంచి పోలీస్ అధికారిణి స్థాయికి: ఎన్ఆర్ఐ మహిళ అసామాన్య ప్రస్థానం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచ జనాభా లెక్కలను చూస్తే గుండె తరుక్కుపోతుంది.ఎందుకంటే పురుషుల సంఖ్యతో పోలిస్తే ప్రపంచ జనాభాలో మహిళల సంఖ్య 63 కోట్లకు పైగా తక్కువ వుందన్నది కాదనలేని వాస్తవం.

మహిళలు ప్రవేశించని రంగమంటూ దాదాపుగా లేదు.అయినాసరే ఇప్పటికే మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది.

అయినప్పటికీ మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు.పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా , ఇంకా చెప్పాలంటే మగవారి కంటే ఓ మెట్టుపైనే అద్భుతాలు చేసి చూపుతున్నారు మగువలు.

సేల్స్‌మెన్‌గా జీవితాన్ని ప్రారంభించి, వుమెన్ ట్యాక్సీ డ్రైవర్‌గా సాహసం చేసి పోలీస్ అధికారిణీగా అత్యున్నత హోదాను సాధించిన ఓ భారత సంతతి మహిళ గురించి తెలుసుకుందాం.

భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మన్‌దీప్ కౌర్ అనే మహిళ.

సీనియర్ సర్జెంట్ హోదాలో విధులు నిర్వర్తించేందుకు న్యూజిలాండ్ పోలీస్ కమిషనర్ ఆండ్రీ కాస్టర్ నుంచి బ్యాడ్జ్ అందుకున్నారు.తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి మహిళా అధికారిణీగా ఆమె చరిత్ర సృష్టించారు.

పిల్లలను భారత్‌లోని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి న్యూజిలాండ్ చేరుకున్న మన్‌దీప్ కౌర్.తొలుత డోర్ టూ డోర్ సేల్స్‌పర్సన్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆమెకు పంజాబీ తప్పించి మరో భాష తెలియదు.అయినప్పటికీ సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డారు.

ఇంగ్లీష్‌ చదవడం, రాయడం వచ్చినప్పటికీ తిరిగి సమాధానం చెప్పలేక ఎన్నో కష్టాలు పడ్డారు మన్‌దీప్.అయితే సేల్స్‌మెన్‌గా ఇంటింటికి తిరిగేటప్పుడు ఓ కాగితం మీద తను చెప్పాల్సింది రాసుకుని ఆ ఇంట్లోని వారికి చూపించేవారు.

సేల్స్‌మెన్ ఉద్యోగం విడిచిపెట్టిన మన్‌దీప్ కౌర్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారారు.2002లో ఓ రోజున ట్యాక్సీలో ప్రయాణిస్తుండగా.వెనుక సీటులో కూర్చొన్న ఓ ప్రయాణీకుడు నీ లక్ష్యం ఏంటని అడగ్గా.అందుకు తాను చిన్నప్పటి నుంచి పోలీస్ అధికారిని కావాలన్నది తన కల అని చెప్పింది.

ఇంటికి వచ్చి దానిపైనే ఆలోచించసాగింది.అయితే తానేందుకు ప్రయత్నించకూడదని భావించిన మన్‌దీప్ కౌర్ వెంటనే దరఖాస్తు చేసింది.

అలాగే పిల్లలు అమర్‌దీప్, పర్నీత్‌లతో కలిసి జీవించేందుకు తనకు దేవుడిచ్చిన అవకాశమని ఆమె భావించారు.

ఆ తర్వాత అక్లాండ్‌లోని మహిళా లాడ్జిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జాన్ పెగ్లర్‌తో తన ఆలోచనలను పంచుకున్నారు.

దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆయన మన్‌దీప్‌ను ఎంతగానో ప్రోత్సహించారు.అయితే పోలీస్ అధికారి కావడం అంత సులభం కాదు.

ఇందుకోసం సుమారు 20 కిలోల బరువు తగ్గి, క్లిష్టమైన ఈత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు.ఈ సవాళ్లను అధిగమించి రెండేళ్ల తర్వాత 2004లో న్యూజిలాండ్ పోలీస్ విభాగంలో మన్‌దీప్ స్థానం సంపాదించారు.

దాదాపు 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆమెకు గత నెలలో న్యూజిలాండ్ పోలీస్ ఫోర్స్‌లో సీనియర్ సార్జెంట్‌గా ప్రమోషన్ లభించింది.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా మన్‌దీప్ చరిత్రలో నిలిచిపోయారు.

ఈ నెలలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించారు మన్‌దీప్ కౌర్.

#MandeepKaur #MandeepKaur: #New Zealand #MandeepKaur #Mandeep Kaur

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు