తనకి కరోనా వైరస్ సోకలేదని చెబుతున్న బాలీవుడ్ నటి

కరోనా వైరస్ ప్రభావం బీటౌన్ లో కూడా గత కొంత కాలంగా కనిపిస్తుంది.కొంత మంది నటులు కరోనా బారిన పడ్డారు.

 Mandana Karimi Doesn't Have Covid-19, Bollywood, Lock Down, Corona Positive, Cor-TeluguStop.com

అలాగే సెలబ్రిటీ కుటుంబ సభ్యులు కూడా కరోనాతో సహవాసం చేసారు.ఇలా చాలా మంది మీద దీని ప్రభావం ఉంది.

ఈ నేపధ్యంలో కొంత మంది మీద కావాలానే కరోనా వచ్చేసింది అనే ప్రచారం కూడా ఉంది.అలాగే బాలీవుడ్ నటి మందన కరిమి మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కరోనా సోకింది అంటూ ప్రచారం జరుగుతుంది.

దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది.తనకు కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.

అయితే తాను కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని పేర్కొన్నారు.
ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన మందన కరిమి తన పట్ల ఇంతటి ప్రేమ కురిపిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

నేను బాగానే ఉన్నాను.ఎవరూ ఆందోళన చెందవద్దు.

కంటికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందంతే.అందుకే రక్తనాళాలు ఇలా ఉబ్బిపోయాయి.

రోజూ ఇంటిని శుభ్రం చేసేందుకు, రసాయనాలు చల్లేందుకు సమయాన్ని కేటాయిస్తున్నా.ఆ క్రమంలోనే ఇదిగో ఇలా జరిగింది.

డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను.అన్నట్లు నాకు కరోనా సోకలేదు.

ప్రేమను పంచండి.సంతోషంగా ఉండండి.

నెగటివ్‌గా ఉండేవాళ్లను మనం పట్టించుకోకూడదు అని మందన చెప్పుకొచ్చారు.కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ సడలింపులు మరింత ప్రమాదకర వాతావరణంలోకి తీసుకుపోతున్నాయి.

ముఖ్యంగా ముంబైలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో కూడా కరోనా కేసులు కలలకం రేపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube