కడియం శ్రీహరి గుట్టు బయటపెట్టిన మంద కృష్ణ మాదిగ   Manda Krishna Madiga Blamed Kadiyam Srihari     2018-01-01   22:47:52  IST  Bhanu C

తెలంగాణా రాష్ట్రంలో దళితులకి న్యాయం జరగడం లేదని మంద కృష్ణ మాదిగ విమర్శించారు.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారా..మీరు చేస్తే న్యాయం మేము చేస్తే అన్యాయమా…ఉద్యమ సమయంలో ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు ధ్వంసం చేయలేదా? ఆందోళనలు చేపట్టలేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ మంద కృష్ణ అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే..

అయితే తెలంగాణా సీఎం కేసీఆర్, కడియం శ్రీహరిలని వారి వారి నియోజకవర్గాలలో తప్పకుండ ఓడిస్తాం అంటూ మంద కృష్ణ తేల్చి చెప్పారు..శ్రీహరి మాదిగలకి అన్యాయం చేస్తున్నారు అంటూ మండి పడ్డారు..ఇప్పటి వరకూ కేసీఆర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై మాట్లాడక పోవడం ఎంతో దారుణం అని విమర్శించారు..మాదిగలు అంటే ఎంతో చులకనగా చూస్తున్నారు కేసీఆర్ మీకు తగిన బుడ్డి చెప్తాం అంటూ ఫైర్ అయ్యారు..ఇదిలా ఉంటే కడియం శ్రీహరి పై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు..

మాదిగలం మా హక్కులకోసం హైదరాబాద్ లో దీక్ష చేయాలని అనుకుంటే కడియం శ్రీహరి మమ్మల్ని ఢిల్లీ లో దీక్ష చేయాలని అన్నారు..సరే మేము ఢిల్లీలో నే దీక్షలు చేస్తాం అయితే టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందా..? అని మేము అడిగి 48గంటలు అయ్యింది ఇప్పటివరకూ సమాదానం రాలేదని ఆయన అన్నారు. ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఇందుకోసం రాజయ్యకు టికెట్‌ రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు..మంగళ వారం ఉదయం 10 గంటలు లోగా మాకు అనుమతులు రావాలని లేకపొతే మా నిర్ణయం మేమే తీసుకుంటాం అంటూ హెచ్చరించారు.