ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన మంచులక్ష్మి!

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సమయం వచ్చిన ప్రతిసారి సొసైటీ గురించి ప్రభుత్వానికి ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఉంటుంది.

 Manchulakshmi Handed A Letter To The Telangana Government, Manchu Lakshmi, Tollywood, Actoress, Letter, Telangana Government-TeluguStop.com

ఈ క్రమంలోనే మంచులక్ష్మి మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని మంచు లక్ష్మి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గత ఏడు సంవత్సరాల నుంచి మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరఫున ఆమె పలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పడమే కాకుండా ఆయా రంగంలో ప్రతిభా వంతులైన వారి చేత కూడా పాఠాలను చెప్పిస్తున్నారు.

 Manchulakshmi Handed A Letter To The Telangana Government, Manchu Lakshmi, Tollywood, Actoress, Letter, Telangana Government-ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన మంచులక్ష్మి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Actoress, Letter, Manchu Lakshmi, Telangana, Tollywood-Movie

ఈ విధంగా చేయడం వల్ల పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా డ్రాపౌట్ స్టూడెంట్స్ శాతం పూర్తిగా తగ్గిపోయిందని మంచు లక్ష్మి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈమె తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి మాట్లాడుతూ ఐసీటీ ట్రైనర్ల వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తే వచ్చే మూడు సంవత్సరాలలో విద్యా రంగంలో ఎంతో గణనీయమైన మార్పులు కలుగుతాయని ఈ విషయం గురించి తెలంగాణ సర్కార్ ఒకసారి ఆలోచించాల్సి ఉందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube