చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు భార్య.. చీర ఖరీదెంతంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు.మోసగాళ్లు, జిన్నా సినిమాలు ఫ్లాప్ కావడంతో మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు.

 Manchu Vishnu Wife Entry Into Saree Business Details Here Goes Viral ,  Viranika-TeluguStop.com

మంచు ఫ్యామిలీ గతంతో పోల్చి చూస్తే సినిమాల విషయంలో నిదానంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే మంచు విష్ణు భార్య చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారని సమాచారం.

మంచు కోడలు కొత్త వ్యాపారంలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.ఒక చీర ఖరీదు కనీసం 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఒక్కో చీరను డిజైన్ చెయ్యడానికి ఏకంగా 75 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.విరానికా ఈ వ్యాపారానికి “విరానికా బ్రైడల్ కలెక్షన్” అని పేరు పెట్టారు.మంచు విష్ణు ఇప్పటికే పలు వ్యాపారాలలో సక్సెస్ అయ్యారు.

Telugu Manchu Vishnu, Manchu Vishnus, Mrinal Thakur, Viranika, Viranika Bridal-M

విరానికా కూడా పలు బిజినెస్ లలో సక్సెస్ సాధించడం గమనార్హం.చీరల వ్యాపారంలో కూడా విరానికా సక్సెస్ అయితే ఆమెకు కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.విరానికా విక్రయించే చీరలలో ఒక్కో చీర తయారు చేయడానికి ఏకంగా 75 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.

ఎంబ్రాయిడరీ పట్టు చీరలను చేతితో డిజైన్ చేస్తారని సమాచారం అందుతోంది.

Telugu Manchu Vishnu, Manchu Vishnus, Mrinal Thakur, Viranika, Viranika Bridal-M

సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధరించిన శారీ తన బ్రైడల్ కలెక్షన్ కు చెందిన శారీ అని ఆ శారీ తయారు చేయడానికి ఏకంగా 980 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందని విరానికా కామెంట్లు చేశారు.మంచు విష్ణు కుటుంబానికి ప్రముఖ సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఈ బిజినెస్ లో ఆమె సక్సెస్ కావడం సులువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.మంచు మనోజ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube