బ్రదర్ నేనున్నా అంటూ అడ్డంగా బుక్ అయిన మంచు విష్ణు.. ఆడుకుంటున్న నేటిజన్స్?

యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆగస్టు 12వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

 Manchu Vishnu Who Was Booked As Brother Nenunna Manchu Vishnu, Nikhil, Karthikay-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమాకు థియేటర్ లు దొరక్కుండా చేశారని, ఈ సినిమా ఇప్పుడు విడుదల చేయడం కుదరదు సెప్టెంబర్ లేదా నవంబర్లో విడుదల చేయమని సలహా ఇచ్చారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన సినిమాలు ఇండస్ట్రీలో విడుదల కావాలన్నా ఎంతో కష్టమని ఎప్పుడు నా జీవితంలో నేను ఏడ్చలేదని ఫస్ట్ టైం ఈ సినిమాకు థియేటర్లో దొరకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని నిఖిల్ ఎమోషనల్ అయ్యారు.అయితే అదృష్టవశాత్తు ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల చేయడానికి థియేటర్లు దొరికాయని ఈయన తెలియజేశారు.

ఈ విధంగా సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం లేదంటూ నిఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఈ వ్యాఖ్యలపై మంచు విష్ణు స్పందించారు.

Telugu Chandoo Mondeti, Karthikaya, Manchu Vishnu, Nikhil, Tollywood-Movie

ఈ సందర్భంగా మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా నిఖిల్ కి మద్దతు తెలుపుతూ నేనున్నాను బ్రదర్… నీకే సహాయం కావాలన్న నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ట్వీట్ చేశారు.ఇలా చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ విష్ణును ఓ రేంజ్ లో ఆడుకున్నారు.మీరు మంచు విష్ణు కాదు మంచి విష్ణు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నీకే గతి లేదు మరొకరికి నువ్వు నేనున్నా అనడం ఏంటి అంటూ మరికొందరు మంచు విష్ణును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా మంచు విష్ణు మరోసారి నేటిజన్ల చేతిలో అడ్డంగా బుక్కయ్యారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube