మా బిల్డింగ్‌ ముందు కడతావా? తిరుపతి స్టూడియో ముందు కడతావా విష్ణు?

మంచు విష్ణు నిన్న అమరావతి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.సీఎంతో లంచ్ చేసినట్లుగా ట్విట్టర్లో పేర్కొన్నారు మంచు విష్ణు.

 Manchu Vishnu Want Start A Film Studio In Tirupati Soon Details, Manchu Vishnu,-TeluguStop.com

అంతే కాకుండా మీడియా సమావేశంలో కూడా మాట్లాడాడు.జగన్ ను కలిసిన సందర్భంగా టాలీవుడ్ కి సంబంధించిన విషయాలను మాట్లాడలేదు అని చెప్పుకొచ్చాడు.

మోహన్ బాబు యూనివర్సిటీ గురించి ఆయనకు తెలియజేశాను అన్నాడు.మంచు విష్ణు ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రభుత్వం నుండి టాలీవుడ్ కు అందిన ఆహ్వానం లో నాన్న గారి పేరు కూడా ఉంది.కానీ ఆయనను కావాలనే తప్పించారు, ఆయనని అమరావతి తీసుకు వెళ్ళకుండా ఎవరు అడ్డు పడ్డారో నాకు తెలుసు అంటూ మంచు విష్ణు వ్యాఖ్యలు చేశాడు.

అదే సమయంలో తిరుపతి లో ఒక సినీ స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నాడు.

ప్రభుత్వం నుండి అనుమతులు మరియు ప్రోత్సాహకాలు దక్కుతాయని ఆశిస్తున్నట్లు గా చెప్పుకొచ్చాడు.

మంచు విష్ణు సినీ స్టూడియో నిర్మిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.మా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో కచ్చితంగా మా అసోసియేషన్ కు సొంత బిల్డింగ్ నిర్మిస్తానని ప్రకటించారు.అధ్యక్ష పదవి చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కనిపించట్లేదు.

మా బిల్డింగ్ నే కట్టలేని నువ్వు ఏకంగా తిరుపతిలో స్టూడియోని కడతావా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరి కొందరు మొదట మా బిల్డింగ్‌ ను పూర్తి చేసి చూపించు అప్పుడు నువ్వు తిరుపతిలో స్టూడియో కడతావని నమ్ముతాము అంటున్నారు.

మంచు విష్ణు పై ఈ మధ్య కాలంలో వరుసగా విమర్శలు.ట్రోల్స్ కామన్ అయ్యాయి.ఎంతగా ట్రోల్స్ వచ్చినా కూడా తన పని తాను చేసుకు పోతున్నాడు.

ఇక ఆయన నిర్మించిన సన్ ఆఫ్ ఇండియా విడుదలకు సిద్ధమైంది.మోహన్ బాబు నటించిన సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ఇంకా ప్రముఖ నటీనటులు నటించారు.

ఈనెల 25వ తారీఖున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.నిర్మాతగా కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్న మంచు విష్ణు సన్ ఆఫ్ ఇండియా తో ఏమైనా కలిసి వస్తుందో చూడాలి.

Manchu Vishnu Want Start A Film Studio In Tirupati Soon Details, Manchu Vishnu, Mohan Babu, Ys Jagan, Tollywood, Maa President, Tirupathi, Film Studio, Maa Building, Son Of India, Tollywood Industry, Pragya Jaiswal - Telugu Studio, Maa, Manchu, Manchu Vishnu, Mohan Babu, Pragya Jaiswal, Son India, Tirupathi, Tollywood, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube