'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచువారి అబ్బాయి !

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.అయితే ఇంతకు ముందు వరకు మా ఎన్నికలు ఇంత రసవత్తరంగా ఉండేవి కాదు.

 Manchu Vishnu To Contest For Maa President Against Prakash Raj-TeluguStop.com

మా ఎన్నికలు రెండు సంవత్సరాల కొకసారి జరుగుతాయి.ఇంతకు ముందు ప్రెసిండేట్ పదవి కోసం ఏకగ్రీవముగా ఎన్నుకునే వారు.

కానీ గత ఎన్నికల నుండి పోటీ మొదలయ్యింది.

 Manchu Vishnu To Contest For Maa President Against Prakash Raj-మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచువారి అబ్బాయి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఇంతకు ముందు ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి.కానీ గత ఎన్నికల నుండి బయట రాజకీయాల్లో లాగా ఇక్కడ కూడా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోస్తూ ఈ ఎన్నికలను కూడా రసవత్తరంగా మార్చారు.

అయితే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఎలక్షన్స్ జరగ బోతున్నారు.

Telugu Chiranjeevi, Maa Elections, Maa Elections 2021, Maa Elections Contestants, Maa President, Manchu Vishnu, Manchu Vishnu To Contest For Maa President, Naresh, Prakash Raj, Shivaji Raja, Tollywood Industry-Movie

ఈ ఎలెక్షన్స్ లో ప్రకాష్ రాజ్ కూడా పోటీ లోకి దిగబోతున్నాడని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.అయితే ఈయనకు గట్టి పోటీగా మంచి వారి అబ్బాయి కూడా బరిలోకి దిగబోతున్నాడని తెలుస్తుంది.మంచు విష్ణు మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

Telugu Chiranjeevi, Maa Elections, Maa Elections 2021, Maa Elections Contestants, Maa President, Manchu Vishnu, Manchu Vishnu To Contest For Maa President, Naresh, Prakash Raj, Shivaji Raja, Tollywood Industry-Movie

త్వరలోనే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.అయితే ప్రకాష్ రాజ్ చిరంజీవి అండతో మా ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయ్యారని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి అండతో ప్రకాష్ రాజ్ బరిలోకి దిగబోతున్నాడు కాబట్టి విష్ణు కు గట్టి పోటీ ఉంటుందనే చెప్పాలి.

అయితే మరొక పక్క చిరంజీవి ని కలిసిన తర్వాతే మంచు విష్ణు పోటీకి సిద్ధం అయ్యాడని కూడా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఇవి రూమర్స్ అయినా కూడా ఈ పోటీ మాత్రం రసవత్తరంగా మారబోతుందనే చెప్పాలి.

#Chiranjeevi #Manchu Vishnu #Naresh #MAA Elections #ManchuVishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు