'మా' ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న విష్ణు..పెన్షన్ ఫైల్ పై మొదటి సంతకం!

ఎన్నో గొడవలు.మరెన్నో విమర్శల తర్వాత ‘మా’ ప్రెసిడెంట్ ఎన్నికలు పూర్తి అయ్యాయి.

 Manchu Vishnu Takes Charge As The Maa President-TeluguStop.com

గత నెల రోజులుగా ఈ ఎన్నికలపై మా సభ్యులు వాదోప వాదనలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై మరొకరు దూషించు కున్నారు.ఎప్పుడు లేనంత రసవత్తరంగా ఎన్నికలు ఈసారి జరిగాయి.

అయితే ఈ ఎన్నికలు ఎలాంటి విమర్శలు, దూషణలు లేకుండా జరిగి ఉంటే మా పరువు పోయేది కాదు.

 Manchu Vishnu Takes Charge As The Maa President-మా’ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న విష్ణు..పెన్షన్ ఫైల్ పై మొదటి సంతకం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఎవ్వరు ఆలోచించకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

అప్పుడు మొదలు పెట్టిన విమర్శలు ఎన్నికలు పూర్తి అయ్యి ఎన్నికలలో ఓడిపోవడం వల్ల ప్రకాష్ రాజ్ మా సభ్యుడిగా రాజీనామా చేసే వరకు వెళ్లిందంటే ఈ మధ్యలో ఎంత జరిగిందో మనం ఊహించుకోవచ్చు.హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొందాడు.

రెండు రోజుల క్రితం జరిగిన మా ఎన్నికల్లో మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు మంచి విష్ణు మా ప్రెసిడెంట్ పదవికి ప్రమాణ స్వీకారం చేసారు.

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎప్పుడు లేని విదంగా ఈసారి ఎలెక్షన్స్ లో అత్యధిక ఓటింగ్ జరిగింది.ఇక అన్ని అడ్డంకులను దాటుకుని వచ్చి గెలుపొందిన విష్ణు మంచు ఈ రోజు ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నారు.

Telugu Maa Elections 2021, Maa President Manchu Vishnu, Manchu Vishnu Takes Charge As The Maa President, Prakash Raj-Movie

మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే పని మొదలు పెట్టాడు.ఈ రోజు నుండే బాధ్యతలు మొదలు పెట్టిన విష్ణు తొలి సంతకం పెన్షన్ ఫైల్ మీద పెట్టినట్టు సమాచారం.ఈయన ప్రెసిడెంట్ చైర్ లో కూర్చుని ఫైల్ మీద సైన్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక విష్ణు సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ విష్ణు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ డబుల్ డోస్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

#Maa #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు