ఏడాది కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి  

telugu film news -

మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్‌గా బ్రహ్మానందం శ్రీహరి కీలక పాత్రల్లో నటించిన ఢీ చిత్రం కు సీక్వెల్‌ను చేయాలనే ప్రయత్నాలు చాలా ఏళ్లుగా సాగుతున్న విషయం తెల్సిందే. శ్రీనువైట్ల ఈమద్య కాలంలో ఈ సినిమాపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడు.

 Manchu Vishnu Srinu Vaitla Movie Dhee

ఎందుకంటే ఈయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దూకుడు తర్వాత శ్రీనువైట్ల ఇప్పటి వరకు ఒక్క మంచి హిట్‌ను అందుకోలేదు.

అందుకే ఆయన ఈ సినిమాను చేసి మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు.

ఏడాది కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి-Movie-Telugu Tollywood Photo Image

ఏడాది కాలంగా ఢీ సీక్వెల్‌ గురించిన మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఎందుకో స్క్రిప్ట్‌ విషయంలో ఒక తుది నిర్ణయానికి రాలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.ఇలాంటి సమయంలో ప్రముఖ రచయిత ఈ స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టి ఒక హ్యాండ్‌ వేయడంతో స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయినట్లుగా తెలుస్తోంది.

ఢీ సినిమా కథకు ఇది సీక్వెల్‌గా ఉంటుందట.అయితే ఈ సినిమాలో దివంగత శ్రీహరి పాత్రను ఎవరు చేస్తారు, అలాగే బ్రహ్మానందం పాత్రను ఎవరు చేస్తారా అంటూ ఆసక్తి నెలకొంది.

శ్రీహరి పాత్ర విషయంలో ఇంకా ఎవరిని సంప్రదించలేదు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం పాత్రకు గాను వెన్నెల కిషోర్‌ను సంప్రదించారనే టాక్‌ వినిపిస్తుంది.చారి గారు అంటూ బ్రహ్మానందం మరియు మంచు విష్ణుల మద్య జరిగిన కామెడీ అప్పట్లో సంచలనం సృష్టించింది.ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్లీ ఢీ సీక్వెల్‌ దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manchu Vishnu Srinu Vaitla Movie Dhee Related Telugu News,Photos/Pics,Images..