ఇకపై మీడియా ముందుకు రానని ప్రకటించిన మంచు విష్ణు!

Manchu Vishnu Speech At Manchu Vishnu Panel Oath

టాలీవుడ్ మూవీ అసోసియేషన్ ఎన్నికలు గత వారం ఎన్నో వివాదాల నడుమ ఆసక్తికరంగా సాగాయి.చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారో అని కూడా ఊహించ లేకపోయారు.

 Manchu Vishnu Speech At Manchu Vishnu Panel Oath-TeluguStop.com

ఇక ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికల కంటే ఆసక్తికరంగా, హోరాహోరీగా జరిగాయి.చివరకు ఈ పోరులో ప్రకాష్ రాజ్ ను ఓడించి మంచు విష్ణు గెలిచారు.

ఇక ఎన్నికల తర్వాత ఈ రోజు మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసారు.

 Manchu Vishnu Speech At Manchu Vishnu Panel Oath-ఇకపై మీడియా ముందుకు రానని ప్రకటించిన మంచు విష్ణు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్ లో ఈ ప్రమాణ స్వీకారం ఉదయం 11 గంటలకు జరిగింది.

మంచు విష్ణుతో పాటు తన ప్యానల్ లోని సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుండి తాను కానీ తన ప్యానెల్ సభ్యులు కానీ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు.

మా ఎన్నికలు ముగిసాయి కాబట్టి.

ఇక నుండి తాను, తన కమిటీ సభ్యులు మీడియా ముందుకు రామని ప్రకటించారు.ఒక ఏడాదితో తాము తమ సభ్యులు ఎం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని.

అంతే కానీ ముగిసిన ఎన్నికల గురించి మాత్రం మాట్లాడబోమని తెలిపారు.అంతేకాదు ఎన్నికల సమయంలో తాను గెలవాలని పూజలు చేసారని.

వాటిని టివిలో చూశానని అలానే కొంతమంది తమను ఏడిపించారు కూడా అని విష్ణు తెలిపారు.

Telugu Maa, Maamaa, Manchu Vishnu, Manchuvishnu-Movie

ఇక విష్ణు తర్వాత మా గత అధ్యక్షుడు నరేష్ కూడా మాట్లాడారు.ఆయన ఇంకనుండి తాను మంచిని గురించి మాత్రమే మాట్లాడుతానని ఇక నుండి ఏదైనా విమర్శలు తన దృష్టికి వస్తే మీడియాతో కాకుండా సంబంధిత వ్యక్తులతో మాట్లాడుతానని తెలిపారు.మరి చూడాలి మా కొత్త సభ్యులు ఇచ్చిన మాట ప్రకారం మీడియా ముందుకు రాకుండా ఉంటారో లేదో.

#MaaMaa #ManchuVishnu #MAA #ManchuVishnu #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube