గుడ్ న్యూస్ చెప్తానన్న మంచు విష్ణు.. ఎదురుచూస్తున్న ''మా''?

Manchu Vishnu Says Tomorrow He Will Share Very Good News Maa Front

గత కొన్ని రోజుల వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.గతంలో ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.

 Manchu Vishnu Says Tomorrow He Will Share Very Good News Maa Front-TeluguStop.com

ఈ క్రమంలోనే పరస్పరం ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు.ఇలా మా ఎన్నికలు ముగిసిన అనంతరం మా అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు.

ఇలా మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మా సభ్యులకు శుభవార్తను తెలియజేస్తానంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.నేడు మా సభ్యులకు శుభవార్తను తెలియజేస్తానని నూతన అధ్యక్షుడు చెప్పడంతో మా సభ్యులు ఏంటా శుభవార్త అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 Manchu Vishnu Says Tomorrow He Will Share Very Good News Maa Front-గుడ్ న్యూస్ చెప్తానన్న మంచు విష్ణు.. ఎదురుచూస్తున్న మా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి మంచు విష్ణు మా సభ్యులకు ఏ విధమైనటువంటి వార్తను చెబుతారో తెలియాల్సి ఉంది.

ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మంచు విష్ణు మా బిల్డింగ్ పూర్తిగా తన సొంత డబ్బులతో నిర్మిస్తానని మాట ఇచ్చారు.

అయితే ఎన్నికలలో గెలిచిన తర్వాత మరో మూడు నెలల్లో మా బిల్డింగ్ గురించి అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించారు.ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా సభ్యులకు అధ్యక్షుడు శుభవార్తను తెలియజేస్తానని హింట్ ఇవ్వడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మంచు విష్ణు ఎలాంటి శుభవార్తను తెలియజేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

#Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube