అల్లు అర్జున్ అంటే అసూయ.. నటుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు?

Manchu Vishnu Said He Jealous Allu Arjun Interview

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి నూతన అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.మా అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం మంచు విష్ణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 Manchu Vishnu Said He Jealous Allu Arjun Interview-TeluguStop.com

ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంచు మనోజ్ మెగా కుటుంబంతో తనకు ఉన్న రిలేషన్ గురించి తెలియజేశారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు బన్నీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు బన్నీకి మంచి రిలేషన్ ఉందని తరచూ మేము ఫోన్ లో చాటింగ్ చేస్తామని తెలిపారు.అలాగే ఒకనొక సమయంలో అల్లు అర్జున్ అంటే ఎంతో అసూయ కలిగిందని అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

 Manchu Vishnu Said He Jealous Allu Arjun Interview-అల్లు అర్జున్ అంటే అసూయ.. నటుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది.అయితే అదే సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నటువంటి లాల్ సింగ్ చద్దా సినిమా కూడా విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ మ్యాగజైన్స్ లో తెలుగు హీరో అల్లుఅర్జున్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కి పోటీ ఇవ్వబోతున్నాడని రాయడంతో ఆ వార్త చూసి తనకు అల్లు అర్జున్ పై అసూయ కలిగిందని అదేవిధంగా ఒక తెలుగు నటుడిగా అల్లు అర్జున్ ఆ స్థాయిలో ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Telugu Allu Arjun, Ameer Khan, Icon Star Allu Arjun, Laal Singh Chadda, Manchu Manoj, Manchu Vishnu, Pushpa Movie, Sensational Comments, Tollywood-Movie

అయితే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కు మెసేజ్ చేసి చెప్పాను.బ్రదర్ నిన్ను చూస్తుంటే అసూయగా ఉన్న మరో వైపు ఎంతో గర్వంగా ఉందని మెసేజ్ చేశానని ఈ సందర్భంగా విష్ణు అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న టువంటి పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ అల్లు అర్జున్ కి మా అధ్యక్షుడు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

#Manchu Vishnu #Manchu Manoj #Pushpa #Allu Arjun #Ameer Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube