ప్రకాష్ రాజ్ నిర్ణయంపై స్పందించిన విష్ణు.. వెనక్కి తీసుకోండంటూ..!

మా అధ్యక్ష ఎన్నికలు నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన సంగతి తెలిసిందే.హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను ఓడించి మంచు విష్ణు గెలిచారు.

 Manchu Vishnu Reaction On Prakash Raj Resignation, Manchu Vishnu, Prakash Raj, P-TeluguStop.com

ఈ ఎన్నికల కోసం గత 20 రోజులుగా మా సభ్యులు ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ ఎన్నికల వేడిని రాజేశారు.ముందుగా చాలా మంది ఈ అధ్యక్షా పదవికి పోటీ పడగా చివరకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బరిలో నిలిచారు.

మా ఎన్నికల్లో ఎప్పుడు లేనంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరగడంతో చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.అంతేకాదు ఈసారి ఓటింగ్ కూడా ఎక్కువ శాతం జరిగిందని తెలుస్తుంది.

ఇంత ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో చివరకు విష్ణు గెలుపొంది మా అధ్యక్ష పదవిని అధిష్టించ బోతున్నారు.నిన్న ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు.

మా సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్ళే అధ్యక్షుడు కావాలని ఎన్నుకున్నారని వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని కానీ నాకు ఆత్మ గౌరవం ఉందని అందుకే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని దీనిని మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్ రాజ్ తెలిపాడు.కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని న రాజీనామా ఆమోదించాలని విష్ణు ను కోరారు.

ఇక ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు.ప్రకాష్ రాజ్ చేసిన మెసెజ్ తో పాటు మంచు విష్ణు ఇచ్చిన రిప్లై కూడా స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.మీ నిర్ణయం నాకు సంతోషకరం కాదు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.గెలుపు, ఓటమిలు సహజంమీరు మా కుటుంబంలో మెంబర్.మీ సలహాలు సూచనలు ‘మా’కు అవసరం మనం కలిసి మాట్లాడుకుని చర్చించుకుందాం అంతవరకు తొందరపడకండి అని మంచు విష్ణు రిప్లై ఇచ్చారు.భవిష్యత్తు కోసం మేమంతా ఒక్కటే అని విష్ణు ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube