తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మంచు విష్ణు..!

తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.

 Manchu Vishnu Praises Telangana Cm Kcr-TeluguStop.com

ఆర్ ను ప్రశంసించారు సినీ నటుడు మంచు విష్ణు.కరోనా లాక్ డౌన్ నుండి ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయిచింది.ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుసుకున్న మంచు విష్ణు తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

 Manchu Vishnu Praises Telangana Cm Kcr-తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మంచు విష్ణు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణా సిఎం కె.సీ.ఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ టీచర్స్ అంతా సంతోషిస్తారని తెలిపారు మంచు విష్ణు.సోమవారం మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునే ఉద్దేశంతో ప్రతి నెలా వారికి 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని అందించాలనే నిర్ణయం అద్భుతమని అన్నారు.

ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతోమందికి మీపై గౌరవం పెరిగిందని ట్వీట్ చేశారు మంచు విష్ణు.కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలను మూసేసింది తెలంగాణా ప్రభుత్వం.

ప్రైవేట్ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఆర్ధిక సాయం అందించేలా 32 కోట్ల నిధులు విడుదల చేసింది.స్కూల్స్ తెరిచే వరకు ప్రతి నెలా ఒక్కొక్కరికి 2 వేల రూపాయలు, 25 కిలోల బియ్యం అందిచనున్నారు.

#Praises #Manchu Vishnu #Telangana State #Telangana Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు