మంచు విష్ణు మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?- Manchu Vishnu Mosagallu Movie Release Date Fix

mosagallu movie, kajal agarwal, manchu vishnu, crime film - Telugu Crime Film, Kajal Agarwal, Manchu Vishnu, Mosagallu Movie

బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మంచు విష్ణు.తొలిసారి 1985లో రగిలే గుండెలు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మంచు విష్ణు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.సినిమాలలో హీరోగా నటించి గొప్ప విజయాన్ని అందుకున్నాడు.

 Manchu Vishnu Mosagallu Movie Release Date Fix-TeluguStop.com

2003లో “విష్ణు” సినిమా తో హీరోగా తెరకెక్కాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందించగా.

ఈ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు.కొన్ని సినిమాలో అతిథి పాత్రల్లో కూడా నటించాడు.

 Manchu Vishnu Mosagallu Movie Release Date Fix-మంచు విష్ణు మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత వరుస సినిమాలతో బిజీ గా మారాడు.దాదాపు 22 కు పైగా సినిమాలలో నటించాడు.

ఇదిలా ఉంటే మంచు విష్ణు మరో సినిమా “మోసగాళ్లు” రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట.

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో వస్తున్న “మోసగాళ్లు”.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.పెళ్లి తర్వాత వరుస ఆఫర్లతో బిజీ గా ఉన్న కాజల్ ఈ సినిమా ఎటువంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

ఈ సినిమాకు 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.కాగా ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నామని చిత్ర బృందం తెలపగా మార్చి 11న విడుదలవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మోసగాళ్లు సినిమాను గత కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నదని తెలిపారు.అంతేకాకుండా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సినీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

క్రైమ్ పరంగా వస్తున్నా ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

#Kajal Agarwal #Crime Film #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు