ఐటీ స్కాంను బట్టబయలు చేస్తున్న హీరో

మంచు విష్ణు సినిమాలు అడపాదడపా చేస్తున్నా ఎందుకనో హిట్ మాత్రం దక్కడం లేదు.దాదాపు ఫేడవుట్ అయ్యే స్థితిలో ఉన్న మంచు విష్ణు ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Manchu Vishnu Mosagallu First Look Released-TeluguStop.com

అయితే ఈసారి ఏకంగా హాలీవుడ్ దర్శకుడితో తన సత్తా చూపించేందుకు మంచు విష్ణు రెడీ అయ్యాడు.అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుందని సినీ జనం అంటున్నారు.

విష్ణు నటిస్తోన్న తాజా చిత్రం మోసగాళ్ళు.ఈ సినిమాకు సంబంధించిన విష్ణు ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సినిమాలో విష్ణు ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు.అర్జున్ అనే పాత్రలో విష్ణు నటిస్తోన్న ఈ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కాంకు సంబంధించిందిగా చిత్ర యూనిట్ పేర్కొంది.

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుకు సోదరిగా అందాల భామ కాజల్ నటిస్తోంది.

Telugu Manchu Vishnu, Mosagallu, Telugu-

పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.మరి ఈ సినిమాతోనైనా విష్ణు హిట్ కొడతాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube